సమీక్ష : రచ్చ చేసిన ‘బెంగాల్ టైగర్’

మాస్ మహరాజ్ రవితేజ ‘రచ్చ’ ఫేం సంపత్ నంది కాంబోలో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ సినిమా ముందునుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కిక్-2 ఫ్లాప్ తరవాత రవితేజ కసితో తీసిన సినిమా కాబట్టి అభిమానుల్లో అంచనాలు కూడా అదే రేంజ్ ఉన్నాయి. ఈరోజు విడుదలైన ‘బెంగాల్ టైగర్’ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఈనాటి మన సమీక్షలో చూద్దాం.

కథ :

సరదాగా జీవితాన్ని గడుపుతున్న ఆకాశ్ నారాయన్ (రవితేజ) అంటే ఇంట్లో వారందరికి లోకువే.. ఎటువంటి జీవిత లక్ష్యం లేదు అంటూ ప్రతిసారి దెప్పిపొడుస్తూ ఉంటారు. ఆ దారిలోనే ఇంట్లో వారు బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం అక్కడ హీరోయిన్ అక్ష తనకు సెలబ్రిటీ లాంటి మొగుడు కావాలని చెప్పడంతో కథ మొదలవుతుంది. తను ఫేమస్ అవ్వడం కోసం మంత్రి మీటింగ్ జరుగుతుండగా రాయితో కొట్టి అతని బ్యాచ్ లో చేరతాడు అకాశ్. ఆ క్రమంలోనే హోం మంత్రి (రావు రమేష్) ని కూడా తన తెలివితేటలతో బుట్టలో వేసుకుంటాడు. హోం మంత్రి కూతురు శ్రద్ధ ఆకాశ్ ని ఇష్టపడుతుంది. ఆకాశ్ కూడా ఆమెను ఇష్టపడ్డట్టు నటిస్తాడు కాని చివరకు ప్లేట్ మార్చి సి.ఎం అశోక్ గజపతి (బొమ్మన్ ఇరాని) కూతురు మీరా (తమన్నా)ని ప్రేమిస్తున్నానని అందరికి షాక్ ఇస్తాడు. అయితే ఇందంతా తన తండ్రిని చంపినందుకు రివేంజ్ తీసుకునే ఆకాశ్ అలా చేస్తున్నాడని తెలుస్తుంది. అసలు హోం మినిస్టర్ కూతురి నుండి ఆకాశ్ సి.ఎం కూతురికి ఎందుకు షిఫ్ట్ అయ్యాడు..? సి.ఎం ని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి..? తన ఊరికి సి.ఎంకి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా..!

సాంకేతిక నిపుణులు :

సంపత్ నంది అనగానే మాస్ సినిమా అని ఫిక్స్ అయ్యేలా ఫీల్ వస్తుంది. రవితేజని ఒక సైడ్ స్టైలిష్ గా చూపిస్తూనే మరో వైపు మాస్ తో ఇరగొట్టేశాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. ప్రతి సన్నివేశంలో దర్శకుడి ఆలోచన ప్రెజెంట్ చేయడంలో కెమెరా మెన్ సక్సెస్ అయ్యాడు. సినిమాకు మంచి సంగీతం అందించాడు భీమ్స్.. పాటలన్ని విడుదలకు ముందే హిట్ అయ్యాయి కాబట్టి సినిమాలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక చిన్నా అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక కథా కథనం దర్శకత్వం అన్నీ తానై నడిపించిన సంపత్ నంది పనితనం ఈ సినిమాలో బాగా కనిపించింది. సినిమాలో రవితేజ చేత చెప్పించిన పంచ్ డైలాగులు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సంపత్ దర్శకత్వం మాత్రం ఎక్కడ పొరపాటు చేయలేదని చెప్పొచ్చు. కాని కథ కత్నాల్లోనే కొత్తదనం లోపించిందని అనిపిస్తుంది.

For all the live updates and Box office information, follow us at @telugu360 https://twitter.com/telugu360

విశ్లేషణ :

బెంగాల్ టైగర్ అనే మంచి మాస్ టైటిల్ పెట్టినందున మాస్ మహరాజ్ రవితేజని హీరోగా తీసుకున్న సంపత్ ఆ టైటిల్ కి తగ్గ మంచి మాస్ సినిమానే ప్రేక్షకులకు అందించాడు. మొదటి భాగం మొత్తం కామెడీతో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం మాస్ ప్రేక్షకులకు కావాల్సినన్ని పోరాట ఘట్టాలను ఉంచాడు. సినిమా కథ ఇదవరకు రామ్ చరణ్ తో తీసిన రచ్చ సినిమాకు దగ్గరగా ఉన్నదనే భావన కలిగినా కాస్త కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సంపత్ నంది. సినిమా కథ పరంగా ఓకే కాని హీరో క్యారక్టర్ బిల్డ్ అప్ ఎక్కువైదని మాత్రం చెప్పాలి. ఊర్లో ఎందుకు పనికిరాడు అనుకుంటున్న కుర్రాడు సి.ఎం ని కలవడం లాంటివి కొన్ని లాజికల్ గా అనిపించవు. సినిమా సెకండ్ హాఫ్ కాస్త బోర్ అనిపించినా మాస్ ప్రేక్షకులకు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలేవి లేవు. మాస్ మహరాజ్ రవితేజ నటన సినిమాకే హైలెట్.. ఇక మీరాగా తమన్నా, శ్రద్ధగా రాశి ఖన్నాలు అందాల ఆరబోత అదుర్స్ అనిపించేలా ఉంది. కామెడీ సీన్స్ కూడా ఓ మోస్తారుగా పండాయనే చెప్పాలి. 30 ఇయర్స్ పృధ్వి సినిమాలో ఫ్యూచర్ స్టార్ సిద్ధప్పగా ప్రేక్షకులను నవ్వించాడు. బొమన్ ఇరాని, రావు రమేష్, శియాజి షిండేలు తమ తమ పాత్రల పరిది మేరకు నటించి మెప్పించారు.

ప్లస్ పాయింట్స్ :

ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్

మాటలు, దర్శకత్వం

నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ రొటీన్ సీన్స్

ముందే ఊహించే కథ, కథనాలు

తీర్పు :

మాస్ మహరాజ్ రవితేజ సినిమాలంటే ఫ్యామిలీ అంతా కలిసి చూడదగినవిగా ఉంటాయ్. అయితే ఈ సినిమాలో కాస్త హీరోయిన్స్ తమన్నా, రాశి ఖన్నాల అందాల ఆరబోత ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఇబ్బంది పెడుతుంది. సినిమా రెగ్యులర్ మాస్ సినిమా అయినా కొద్దికాలంగా ఇలా పక్కా మాస్ ప్రేక్షకుల కోసమే సినిమా వచ్చి చాలా రోజులైంది కాబట్టి వారిని బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. సినిమాలో మొదటి భాగం పృధ్వీ, పోసాని కామెడీ సినిమాకు కాస్త పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేసినా సెకండ్ హాఫ్ ప్రేక్షకులు ముందే ఊహించే విధంగా ఉంటుంది. సరదాగా సినిమా చూద్దాం అనుకునే వారికి తప్పకుండా నచ్చే సినిమా బెంగాల్ టైగర్. ఇక మాస్ ఆడియెన్స్ కి మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిదైతే… యూత్ కూడా సినిమాలోని కామెడీ పంచ్ డైలాగులకు కనెక్ట్ అవుతారు. చివరగా బెంగాల్ టైగర్ గా రవితేజ, సంపత్ నందిలు కలిసి రచ్చ చేశారని చెప్పొచ్చు.

నటీనటులు: రవితేజ, తమన్నా, రాశి ఖన్నా, బొమన్ ఇరాని, రావు రమేష్, శియాజి షిండే
సంగీతం : భీమ్స్
ఎడిటింగ్ : గౌతం రాజు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : సంపత్ నంది
నిర్మాత : కె.కె.రాధామోహన్

For all the live updates and Box office information, like us on Facebook. https://www.facebook.com/telugu360

తెలుగు360 రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close