విజయవాడ జిల్లా జైలుకు జైలర్ గా ఉన్న హంసా పాల్ అనే అధికారిని బదిలీ చేసారు. ఈ పాల్ మామూలు అధికారి కాదు. ఆయన జగన్ రెడ్డి ప్రార్థనల్లో మునిగి తేలుతూంటారని జైళ్ల శాఖలో అందరికీ తెలుసు. జైలుకు సంబంధించి ఎలాంటి సమాచారం అయినా హాట్ లైన్ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుందని కూడా చెబుతారు. ఇప్పుడు ఆయనను హఠాత్తుగా బదిలీ చేసి..ఎక్కడోకి పంపారు. కానీ చాలా మందికి అర్థం కాని విషయం.. అత్యంత కీలక కేసుల్లో నిందితులు.. ముఖ్యంగా జగన్ రెడ్డికి సన్నిహితులయిన వారు జైల్లో ఉన్నప్పుడు ఆయనను ఇప్పటి వరకూ అక్కడ ఎందుకు కొనసాగించారన్నదే ?
వల్లభనేని వంశీ మూడు నెలలుగా జైల్లో ఉన్నారు. ఇక ఐపీఎల్ ఆఫీసర్ గా పని చేసి.. ఎవర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో బాగా తెలిసి.. మాటలతో దబాయించే పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా జైలుకు వచ్చి చాలా కాలం అయింది. లిక్కర్ కేసు నిందితులూ అక్కడే ఉన్నారు. ఇంత మంది కీలక నిందితులు జైల్లో ఉంటే.. వారికి కాపలాగా.. వైసీపీకి వీరభక్తుడని తెలిసి కూడా ఎందుకు ఇంత కాలం ఉంచారన్నది అర్థం కాని విషయం.
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించాల్సిన తరుణంలో .. ఈ హంసా పాల్ చేస్తున్న బ్యాక్ డోర్ డ్యూటీ గురించి తెలిసినట్లుగా బదిలీ చేశారు. జైల్లో ఉన్న నిందితులకు ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని.. నేరుగా ఫోన్లు మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇలా అసలు డ్యూటీపై కాకుండా..ఇతరులపై విధేయత చూపేవారిని ఎందుకు చివరి వరకూ ఉపేక్షిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం.