భ‌జే వాయు వేగం: కారు రేసు.. డ‌బ్బుల క‌ట్ట‌లు

‘ఆర్‌.ఎక్స్ 100’తో గుర్తింపు తెచ్చుకొన్న హీరో కార్తికేయ‌. అయితే ఆ త‌ర‌వాత ఆ స్థాయి విజ‌యాన్ని అందుకోలేక‌పోయాడు. ఆమ‌ధ్య వ‌చ్చిన `బెదురులంక‌` కాస్త బెట‌ర్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో కార్తికేయ ఓ సినిమా చేస్తున్నాడు. ప్ర‌శాంత్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి ‘భ‌జే వాయు వేగం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు.. టైటిల్ గ్లింప్స్‌ని వ‌దిలారు. ఆంజ‌నేయుడి వేగాన్ని గాలితో పోలుస్తూ ఇలా `భ‌జే వాయు వేగం` అంటూ స్థుతిస్తారు. దాన్ని… టైటిల్ గా మార్చుకొన్నారు. విన‌గానే ఎక్కేసే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ఇది. క‌థ కూడా వేగానికి సంబంధించిన‌దే. దానికి అనువుగానే టైటిల్ గ్లింప్స్ రూపొందించారు. స్పీడుగా దూసుకుపోయే కారు, డిక్కీలో డ‌బ్బుల మూట‌లు.. దీన్ని బ‌ట్టి క‌థ ఏ జోన‌ర్‌లో సాగుతుందో అర్థం చేసుకోవొచ్చు. యూవీ సినిమా కాబ‌ట్టి క్వాలిటీలో రాజీ ఉండ‌దు. మేకింగ్ పెద్ద సినిమాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఉండ‌బోతోంది. కార్తికేయ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య మీన‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ర‌థ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తయ్యింది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ విడుద‌ల చేసి, రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close