‘భలే భలే మగాడివోయ్’ కు క్లీన్ యు స‌ర్టిఫికేట్

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, UV Creations మ‌రియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తున్న ప‌క్కా ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ “భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ చిత్రం సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. ఈచిత్రానికి సంభదించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. సినిమా చూసిన స‌భ్యులు ఆద్యంతం న‌వ్వుతూ చాలా రోజుల త‌రువాత ఇలా సినిమా చూసి న‌వ్వుకున్నాం. హీరో నాని పాత్ర తీరు మ‌మ్మ‌ల్ని న‌వ్వించింది అని ఈచిత్రం ఫ్యామిలి అంతా న‌వ్వుకునే విధంగా ద‌ర్శ‌కుడు మారుతి తీసారు అని అభినందించారు. నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్నారు. మారుతి ద‌ర్శ‌కుడు. బ‌న్నివాసు నిర్మాత‌. గోపిసుంద‌ర్ సంగీతాన్ని అందించారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: ” భలే భలే మగాడివోయ్ సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల చేస్తున్నాం.మారుతి తొ ప‌నిచేయ‌టం హ్య‌పిగా వుంది. లావణ్య త్రిపాఠి చాలా బాగా చేసింది.అల్లు అర‌వింద్ గారి సమ‌ర్ప‌ణ‌లో, UV Creations మ‌రియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 బ్యాన‌ర్ లో బ‌న్నివాసు నిర్మాత‌గా ఈచిత్రం చేయ‌టం ఇంత క్వాలిటిగా రావ‌టానికి కార‌ణం. తప్ప‌కుండా ఫ్యామిలి అంతా ధియోట‌ర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం. సెన్సారు స‌భ్యులు కూడా అదే దృవీక‌రించ‌టం చాలా ఆనందంగా వుంది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ రావ‌టం ఇంకా ఆనందంగా వుంది.గోపిసుంద‌ర్ కి చాలా మంచి ఆడియో ఇచ్చాడు. సెప్టెంబ‌ర్ 4 న ఈచిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా డాల్బి అట్మాస్ లో విడుద‌ల చేస్తున్నారు ” అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ: మా చిత్రం ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్స సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల‌వుతుంది. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ గోపిసుంద‌ర్ సంగీతాన్ని అందించాడు. ప్ర‌మోష‌న్ విష‌యంలో కూడా చాలా కేర్ తీసుకుని డిఫ‌రెంట్ గా సినిమాని ప్రెజెంట్ చేస్తున్నాము. నిజార్ కెమెరా వ‌ర్క్‌ సూప‌ర్బ్ గా వుంటుంది. నేను ఏ క‌థ తీసుకున్నా కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేస్తాను. ఈ చిత్రం మరింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేశాను. ఇదే మాట సెన్సారు స‌భ్యులు చెప్ప‌టం చాలా ఆనందం గా వుంది. త‌ప్పకుండా ఈచిత్రం ఫ్యామిలి అంతా చూడ‌త‌గ్గ చి్త్రం గా వుంటుంది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. డాల్బి అట్మాస్ లో ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల చేస్తున్నాము. అని అన్నారు

నిర్మాత బ‌న్నివాసు మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు మారుతి మెద‌ట చెప్పిన‌ట్టే ఇది ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఇప్ప‌డు సెన్సారు స‌భ్యుల ప్ర‌శంశ‌లు. పొందింది. కోత్త‌జోన‌ర్ లో చిత్రాన్ని తెరకెక్కించాడు. నాని చాలా బాగా న‌టించారు. జ‌న‌ర‌ల్ గా వ‌చ్చే చిన్న చిన్న మ‌తిమ‌రుపు స‌న్నివేశాలు చిత్రంలో న‌వ్వులు కురిపిస్తాయి. నాని ఆ పాత్ర‌లో ఒదిగి న‌టించారు. ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ వాల్యూస్ విత్ ఎంట‌ర్టైన్‌మెంట్‌ తో చిత్రీకరించాం. ఫ్యామిలి అంతా న‌వ్వుకునే విధంగా భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం వుంటుంది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ రావ‌టం మా యూనిట్ అందరికి ఆనందం క‌లిగింది. ఈ చిత్రాన్ని డాల్బి అట్మాస్ లో సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల అవుతుంది” .అని అన్నారు.

న‌టీన‌టులు..నాని,లావ‌ణ్య త్రిపాఠి,ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌,సితార‌,స్వ‌ప్న మాధురి,శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌,ప్ర‌వీణ్,ష‌క‌ల‌క శంక‌ర్‌,బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు..

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను,ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌,ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి,సంగీతం: గోపి సుంద‌ర్,నిర్మాత:బ‌న్నివాసు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ రెడ్డి కొంపకు నిప్పెట్టుకుని ఏడాది !

"పిచ్చోడా.. నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు" అని జగన్ రెడ్డిపై ఆప్యాయత చూపే ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి... తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ వరకూ...

మంత్రులు నాడు డమ్మీలు – నేడు పనిమంతులు !

ప్రజాస్వామ్యంలో సీఎం ఒక్కరే పాలకుడుకాదు. ఆయన నేతృత్వంలో అందరూ పని చేయాల్సిందే. కానీ కొంత మంది మాత్రం.. తప్పనిసరిగా పదవుల్ని ఇతరులకు పంచినా అధికారాన్ని ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తూ ఉంటారు....

పడవలు.. వీడని ప్రశ్నలు!

ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనక నిజంగానే కుట్రకోణం ఉందా? ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయలనే పడవలను గాలికి వదిలేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అవును.. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు...

హైడ్రా.. అస్త్రసన్యాసమా?

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల అంతు తేల్చేందుకు తీసుకొచ్చిన హైడ్రా సంచలనం రేపింది. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ ఆక్రమణలను నేలమట్టం చేస్తుందోనని అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించింది. ఫిర్యాదులు రావడమే ఆలస్యం డాక్యుమెంట్ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close