హిట్ అంటే నానిదే..!!

భలే భలే మగాడివోయ్ సినిమా నాని రాతని మార్చేసిందని చెప్పొచ్చు. ఇద్దరు హీరోలు కాదన్న సినిమాను చేసి ఏ చిన్న హీరో కనీసం టచ్ కూడా చేయలేని కలెక్షన్స్ సాధించి హిట్ అంటే ఇదేరా అనేలా చేశాడు. 25 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తెలుస్తున్న లెక్కల ప్రకారం దాదాపు 45 కోట్ల గ్రాస్ కెలక్షన్స్ సాధించిందని ట్రేడ్ న్యూస్. ఇక షేర్ విషయానికొస్తే దగ్గర దగ్గర 26 కోట్ల 90 లక్షల దాకా వచ్చిందట.

అసలు సినిమాకు అయిన బడ్జెట్ 6 కోట్లు కూడా అవ్వలేదు. కాని కలెక్షన్స్ మాత్రం కుమ్మేశాడు నాని. మారుతి చేసిన మ్యాజిక్ నాని లావణ్య త్రిపాటిల యాక్షన్ కలిసి ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేశాయి. ఈ సినిమా ఇంతటి భారీ విజయం సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ అంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్, రీమేక్ రైట్స్ కూడా కలిపితే దాదాపు పెట్టిన దానికి 7-8 రెట్లు వచ్చేసినట్టే అట.

బాహుబలి, శ్రీమంతుడు సాధించినవే రికార్డులు కాదు చిన్న సినిమా అయిన భలే మగాడు కొట్టిన హిట్ కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. సో ఈ దెబ్బతో నాని స్టార్ హీరో అయినట్టే లెక్క.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com