‘భామాక‌లాపం 2’ రివ్యూ: ఓ ఇల్లాలి దొంగ‌త‌నం

బూతు, సెక్స్‌, హింస‌… ఇవ‌న్నీ ఉంటే తప్ప ఓటీటీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేరేమో అన్న‌ది కేవ‌లం అపోహ మాత్ర‌మే. క్లీన్ ఇమేజ్ ఉన్న క‌థ‌లకూ ఓటీటీ ప‌ట్టంక‌డుతుంది. దాన్ని నిరూపిస్తూ ఈమ‌ధ్య తెలుగులో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లూ వ‌చ్చాయి. వాటిలో ‘భామాక‌లాపం’ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఓ సామాన్య‌మైన మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇల్లాలు ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో చిక్కుకోవ‌డం ‘భామాక‌లాపం’ పాయింట్‌. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా ‘ఆహా’లో విడుద‌లై మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకొంది. ఇప్పుడు దానికి సీక్వెల్ త‌యారైంది. ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర పోషించిన ఈ కొన‌సాగింపు క‌థ ఎలా వుంది? ఈసారి ప్రియ‌మ‌ణి చేసిన సాహ‌సం ఏమిటి?

అనుప‌మ (ప్రియ‌మ‌ణి) త‌న చేసిన త‌ప్పుల్ని, ఆ ఇంటిని వ‌దిలేసి, భ‌ర్త‌, పిల్లాడితో క‌లిసి కొత్త‌గా గేటెడ్ క‌మ్యునిటీలో అడుగుపెడుతుంది. ఇత‌రుల విష‌యాల్లో జోక్యం చేసుకోకుండా.. త‌న ప‌ని తాను చేసుకుపోతుంది. ‘అనుప‌మ ఘుమ‌ఘుమ‌’ అనే ఓరెస్టారెంట్ పెడుతుంది. త‌న‌తో పాటు శిల్ప (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) భాగ‌స్వామిగా చేరుతుంది. మ‌రోవైపు కుకింగ్ ఐడ‌ల్ పోటీల్లో పాల్గొంటుంది. అంతా ఓకే అనుకొంటున్న త‌రుణంలో త‌న జీవితంలో అనూహ్య‌మైన ఘ‌ట‌న జ‌రుగుతుంది. ఓ గంజాయి స్మ‌ర్ల‌ర్‌ని త‌న ప్ర‌మేయం లేకుండానే పోలీసుల‌కు ప‌ట్టిస్తుంది. ఆ స్మ‌గ్ల‌రేమో అనుప‌మ‌పై ప‌గ పెంచుకొంటాడు. త‌న‌ని స్మగ్ల‌ర్ నుంచి ర‌క్షించ‌మ‌ని ఓ పోలీస్ అధికారిని వేడుకొంటే… అత‌నేమో అనుప‌మ‌కి ఓ టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ప్ర‌కారం వేయి కోట్ల విలువైన ఓ బొమ్మ‌ని అనుప‌మ దొంగిలించాలి. ఇంత‌కీ.. ఆ బొమ్మ‌లో ఏముంది? అనుప‌మ ఎలా దొంగిలించింది? కుకింగ్ ఐడ‌ల్ కాంపిటీష‌న్‌కీ, ఈ వెయ్యి కోట్ల దొంగ‌త‌నానికీ ఉన్న లింకేమిటి? అనేది తెర‌పైనే చూడాలి.

త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డం కోసం ఓ స‌గ‌టు ఇల్లాలు చేసిన రిస్క్‌.. భామా క‌లాపం 2. తొలి భాగం ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చుట్టూ న‌డుస్తుంది. రెండో భాగాన్ని ఓ దొంగ‌త‌నంతో ముడిపెట్టారు. క‌థ ప్రశాంతంగా మొద‌ల‌వుతుంది. ఎప్పుడైతే… అనుప‌మ స్మ‌గ్ల‌ర్‌ని ప‌ట్టించిందో, అప్ప‌టి నుంచీ ఆమెకు త‌ల‌నొప్పులు మొద‌ల‌వుతాయి. తొలి భాగంలో అనుప‌మ స‌మ‌స్య‌ల్ని వెదుక్కొంటూ వెళ్తుంది. ఇక్క‌డ రివ‌ర్స్‌. స‌మ‌స్య‌లే ఆమెను వెంబ‌డిస్తాయి. ఫ‌స్ట్రేటెడ్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థని, వెయ్యి కోట్ల విలువైన స‌రుకు చేతులు మార‌డాన్ని స‌మాంత‌రంగా న‌డుపుతూ.. ఇవ‌న్నీ క‌లిపి ఒకే గాటిన క‌ట్టేశాడు ద‌ర్శ‌కుడు. ఆ మేళ‌వింపు ఆక‌ట్టుకొంటుంది. దొంగ‌త‌నం ఎవ‌రు చేయాలి? ఎలా చేయాలి? అంటూ స్కెచ్ వేయ‌డం, చాలా విష‌యాల్ని వాయిస్ ఓవ‌ర్‌లో చెప్పుకొంటూ వెళ్లిపోవ‌డం అంత‌గా మెప్పించ‌ని విష‌యాలు. ఇలాంటి క‌థ‌ల్లో ఎగ్జిక్యూష‌న్ చాలా ముఖ్యం. దొంగ‌త‌నం ప్ర‌ధాన ఎలిమెంట్ కాబ‌ట్టి, దాన్ని ఎంత చాక‌చ‌క్యంగా చెప్పార‌నేది కీల‌కం. మ‌నీ హీస్ట్ లాంటి వెబ్ సిరీస్‌లు చూశాక‌… ఏం చేసినా, ఏం చూపించినా తేలిపోతుంటుంది. అందుకే వీలైనంత క‌స‌ర‌త్తు చేయాల్సిన విభాగం ఇది. అయితే ద‌ర్శ‌కుడు… అస‌లైన దొంగ‌త‌నం ఎపిసోడ్‌ని ‘మ‌..మ‌’ అనిపించాడు. చివ‌ర్లో ఒక‌ట్రెండు ట్విస్టులున్నాయి. అయితే అవి కూడా ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందుతాయి. ప్రియ‌మ‌ణి కారు బొమ్మని పోలీస్ అధికారికి ఇచ్చిన‌ప్పుడే.. చివ‌ర్లో ట్విస్టుని ఊహించొచ్చు. క్లైమాక్స్ కూడా హ‌డావుడిగా ముగిసిన‌ట్టు అనిపిస్తుంది.

చివ‌ర్లో విదేశాల్లో అనుప‌మ‌కు మాస్ట‌ర్ చెఫ్‌గా ఉద్యోగం రావ‌డం వ‌ర‌కూ బాగానే ఉంది. ‘రా’ కూడా ఫోన్ చేసి ‘మాకు మీ సేవ‌లు కావాలి’ అని కోర‌డం.. పూర్తిగా అతి. మూడో భాగానికి వేసిన స్కెచ్ అది. పార్ట్ 3 విదేశాల్లో ఉండ‌బోతోంద‌న్న హింట్ ఇవ్వ‌డానికి అది ఉప‌యోగ‌ప‌డింది. అయితే ద‌ర్శ‌కుడు చిన్న చిన్న డిటైలింగ్స్ బాగా వాడుకొన్నాడు. ఉదాహ‌ర‌ణ‌కు హోటెల్ పెచ్చు ప‌డిపోవ‌డం, చివ‌ర్లో కుక్క‌ని అనుప‌మ మ‌చ్చిక చేసుకోవ‌డం… లాంటివి. ఇలాంటి డిటైలింగ్స్ వ‌ల్లే ద‌ర్శ‌కుడు స్క్రిప్టుని నిర్ల‌క్ష్యం చేయ‌లేద‌న్న ఫీలింగ్ క‌లుగుతుంటుంది.

ప్రియ‌మ‌ణి స్క్రీన్ ప్ర‌జెన్స్ ఆక‌ట్టుకొంటుంది. అమాక‌త్వం, తెలివితేట‌లు క‌ల‌బోసిన పాత్ర అది. హుందాగా చేసింది. శ‌ర‌ణ్య‌తో ప్రిమ‌య‌ణి కెమిస్ట్రీ… ఈ క‌థ‌కు ప్ల‌స్ పాయింట్. శ‌ర‌ణ్య కామ్‌గా ఉంటూనే జోకులు పేల్చింది. సీర‌త్ క‌పూర్‌ది చిన్న పాత్రే. చివ‌రి ట్విస్ట్ కు ఆ పాత్ర ఉప‌యోగ‌ప‌డింది. బ్ర‌హ్మాజీది చాలా చిన్న పాత్ర‌. భ‌యంక‌ర‌మైన విల‌న్ ఉన్నా, త‌న‌ని స‌రిగా వాడుకోలేద‌నిపిస్తుంది. విల‌న్ గ్యాంగ్ నుంచి అనుపమ‌కు ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న ఫీలింగ్ క‌లిగిస్తే.. మ‌రింత థ్రిల్ క‌లిగేది.

ఓటీటీ కంటెంట్ అంటే హింస‌, బూతు అనుకొంటున్న రోజుల్లో అవేం లేకుండా ఓ క్లీన్ సినిమా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంలో రూప‌క‌ర్త‌ల్ని మెచ్చుకోవాలి. ఓటీటీ కంటెంటే క‌దా అని చుట్టేయ‌లేదు. వీలైనంత వ‌ర‌కూ క్వాలిటీ పాటించారు. రెండు పాట‌లు బాగున్నాయి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో కొన్ని ఎపిసోడ్స్ తేలిపోయాయి. వాటిని సైతం ప‌క‌డ్బందీగా రాసుకొని ఉంటే.. ఇది ‘మ‌నీ హీస్ట్కి’ ఫ్యామిలీ వెర్ష‌న్ అయ్యేది.

ఫినిషింగ్ ట‌చ్‌: ప్రియ‌మ‌ణి ప్ర‌తాపం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close