అవును.. పాకిస్తాన్ కు మాత్రమే కాదు..చైనాకు కూడా భారత్ పెద్ద స్ట్రోక్ ఇచ్చేసింది. చైనా యుద్దపరికరాలతో విర్రవీగుతున్న పాక్ ను తుత్తినియలు చేయడమే కాకుండా యుద్ధరంగంలో భారత్ ఎంతటి ప్రమాదకరమో రెండు దేశాలకు తెలిసివచ్చేలా చేసింది.
పాక్ ఆర్మీ వాడే యుద్ద పరికరాలు అన్నీ మేడిన్ చైనావే, భారత్ పై ఆగ్రహంతో ఆ దేశానికి చైనా యుద్ద పరికరాలను అందిస్తుంది. చైనా యుద్ద పరికరాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి అని, అవి అమెరికాను కూడా మట్టికరిపించే స్థాయిలో ఉంటాయని ప్రచారం ఉంది. కానీ, అదంతా ఉత్తదే అని రుజువు చేసింది భారత్.
చైనాకు చెందిన HQ9 డిఫెన్స్ సిస్టం ను వాడుతోంది పాక్. ఇది దాడులను ముందే గుర్తించి, నిలువరించే వ్యవస్థ. కానీ, ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేసిన దాడులను పసిగట్టడంలో ఈ మేడిన్ చైనా డిఫెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది. భారత్ మాత్రం తన అమ్ములపొదిలోని ఆయుధాలతో పాక్ కు గట్టి సమాధానమే చెబుతోంది.
లేటెస్ట్ గా లాహోర్ లోని చైనాకు చెందిన HQ9 డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేసి భారత సైన్యం అప్పర్ హ్యాండ్ సాధించింది. ఆపరేషన్ సింధూర్ తో రగిలిపోయిన పాక్ భారత్ పై క్షిపణి దాడులకు ప్రయత్నించింది. ఈ దాడులను నిర్వీర్యం చేస్తూ, పాక్ ప్రయత్నాలకు చెక్ పెట్టింది. అయితే మన దగ్గర ఉన్నది చైనా చెత్త సరకు కాదు.. రష్యన్ మేడ్ S 400ఎయిర్ డిఫెన్స్ సిస్టం.