”ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్నులు, కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్.. ఓ తెగ చేసేసాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు’ అంటున్నారు రవితేజ. ఆయన కథనాయకుడిగా నటించిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్, ఆషికా హీరోయిన్స్. తాజాగా ట్రైలర్ వదిలారు.
ఇరివురి భామల నడుమ నలిగిపోయే రామ్ సత్యనారాయణ(రవితేజ) కథ ఇది.
”నీకు పెళ్లి అయిన సరే.. నాతో అలా ఉన్నావంటే.. బాలమణికి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ ఫుల్ గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా?
”అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్న కదా.. నేనుండగా నీ లైఫ్ లోకి మరో అమ్మాయి ఎందుకు వచ్చింది?.. ఈ రెండు ప్రశ్నలు రామ్ సత్యనారాయణ ఎందుకు ఎదురుకోవాల్సి వచ్చిందనేది ఇందులో కాన్ఫ్లిక్ట్.
ట్రైలర్ హిలేరియస్ గా వుంది. మంచి కామెడీ సీన్స్ పడ్డాయి. రవితేజ, డింపుల్, ఆషిక కెమిస్ట్రీ కొత్తగా వుంది. ముఖ్యంగా సత్య కోసం ఏకంగా ఒక సపరేట్ ట్రాక్ రాసుకున్నట్టుగా వున్నారు. అర్జున్ రెడ్డి రిఫరెన్స్, రజనీకాంత్ రోబో, బోయపాటి ఇలా చాలా మేనరిజమ్స్ సత్య ట్రాక్‌లో కనిపించాయి. ఆ మధ్య మంచు వివాదంతో పాపులర్ అయిన జనరేటర్ లో షుగర్ పోసే సీన్ కూడ వుంది.
డైరెక్టర్ కిషోర్ తిరుమల ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పాయింట్‌నే పట్టుకున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. భీమ్స్ మ్యూజిక్ కూడా మీటర్ కి తగ్గట్టుగా వుంది.
‘బుక్ మై షో అంటే ఇదే.. మన షోని మనమే బుక్ చేసుకోవడం’ అంటూ సునీల్ చెప్పిన డైలాగ్ ఇందులో కొసమెరుపు. మొత్తానికి ట్రైలర్ లో మంచి ఫన్ వైబ్ కనిపించింది.
