జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాకు పేపర్లు లేవు.. టీవీలు లేవు అని అందరి ముందు చెప్పుకునేవారు. అందరికీ తెలిసి..కళ్ల ముందు ఉన్న నిజాల్ని కూడా కళ్లార్పకుండా అలా ఎలా అబద్దాలుగా చెబుతారబ్బా అని సామాన్యులు ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఆయనకు మరో విషయం తప్పడం లేదు. అదేమిటంటే.. భారతి సిమెంట్ కూడా ఆయనది కాదట. ఆయనదే కాదు.. ఆయన భార్య భారతిది కూడా కాదట. ఈ వాదనను అపుడే ప్రారంభించేశారు.
లిక్కర్ స్కాం దోపిడీ స్కాం భారతి సిమెంట్స్ లోకి
మద్యం స్కాంలో సీఐడీ పోలీసులు… గోవిందప్ప బాలాజీ అనే ఆడిటర్ ను అరెస్టు చేశారు. ఆయన భారతి సిమెంట్ ఆర్థిక వ్యవహారాలు చూసే ఆడిటర్. విజయసాయిరెడ్డి ఆడిటింగ్ పనులు మానేసి.. జగన్ కోసం మధ్యవర్తిత్వం పనులు ప్రారంభించిన తర్వాత ఈ గోవిందప్ప బాలాజీనే ఆడిటింగ్ పనులు చేసేవారు. జగన్, భారతిల ఆర్థిక వ్యవహారాలు ఈయనే చూస్తారు. ఆయనను అరెస్టు చేశారు. మద్యం స్కాంలో డబ్బులు .. వేరే కంపెనీల ద్వారా.. మనీలాండరింగ్ చేయించి.. భారతి సిమెంట్ లోకి ప్రవహించేలా చేశారని సీఐడీ అధికారులు గుర్తించారు. అందులో గోవిందప్ప పాత్ర కీలకం.
భారతి సిమెంట్స్ జగన్ ది కాదట !
గోవిందప్పను ఆజ్ఞాతంలోకి పంపారు కానీ..సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వెంటనే సాక్షి మీడియా టోన్ మారిపోయింది. గోవిందప్ప బాలాజీ అరెస్టు అక్రమం అని వాదిస్తూనే అసలు.. భారతి సిమెంట్ .. జగన్ కుటుంబానిది కాదనే వాదన ప్రారంభించారు. ఎప్పుడో వికాట్ అనే ఫ్రాన్స్ కంపెనీకి భారతి సిమెంట్స్ ను అమ్మేశామని అది వారి కంపెనీనో అని చెప్పడం ప్రారంభించారు. దీంతో వైసీపీ నేతలకే కాదు.. ఆయన పక్కన ఉన్న వాళ్లకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోతోంది.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు ?
జగన్ రెడ్డి మీడియా, సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం.. భారతి సిమెంట్స్ లో 51 శాతం వాటా వికాట్దే. మరి మెజార్టీ వాటా ఉన్న కంపెనీ ఏం చేయాలి.. కంపెనీని స్వాధీనం చేసుకుని తమ వారిని నియమించుకోవాలి. కానీ ఇక్కడ వికాట్ తరపున ఎవరైనా డైరక్టర్లు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. ఐదుగురు విదేశీయుల్ని డైరక్టర్లుగా చూపించారు. వారు ఈ కంపెనీలో తప్ప వికాట్ లో కూడా వాటాదారులు కాదు. అంతే కాదు ఈ కంపెనీ నిర్వహణలో అసలు వారి పాత్ర ఏమీ ఉండదు. మొత్తం జగన్ రెడ్డి, భారతి గుప్పిట్లోనే ఉంటుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు అమ్మకాల విప్లవం కూడా సృష్టించుకున్నారు. మరి ఇప్పుడు గోవిందప్ప దొరికిపోయేసరికి భారతి సిమెంట్స్ మాది కాదని వాదించడం.. ఏ రకమైన నీతి…?