భారతి సిమెంట్స్ లీజులను రద్దు చేసేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అక్రమాలకు పాల్పడిన అంశాలపై వివరణ కోరింది. పదిహేనురోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.వారు ఇచ్చే సమాధానాన్ని పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా.. చట్టపరంగా ప్రభుత్వాధికారులు ముందుకు వెళ్తున్నారు. భారతి సిమెంట్స్ విషయంలో ల్యాప్స్ అయిపోయిన లీజులను నిబంధనలకు విరుద్ధంగా వ్యవస్థల్ని ఉపయోగించుకుని భారతి సిమెంట్స్ కు కేటాయింపు చేసుకున్నారు. కేంద్రం ఈ విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించి ఏడాది అయిపోయింది.
భారతి సిమెంట్స్ అసలు పేరు భారతి సిమెంట్స్ కాదు. రఘురాం సిమెంట్స్. వైఎస్ సీఎం అయ్యాక దాన్ని జగన్ కొనుగోలు చేశారు. రఘురాం సిమెంట్స్ కంపెనీకే సున్నపురాయి లీజులు ఉన్నాయి. భారతి సిమెంట్స్ గా మారిన తర్వాత ఆ లీజుల్ని కూడా కంపెనీ వాడేసుకుంటోంది. కేంద్రం గనుల విషయంలో చాలా స్పష్టమైన పాలసీ తీసుకుంది. ఓ కంపెనీ పేరుతో లీజులు తీసుకుని మరొకరు ఆ కంపెనీని టేకోవర్ చేస్తే లీజులు చెల్లవని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తులు చేసుకుని ఉన్నా సరే.. అవి ల్యాప్స్ అవుతాయని స్పష్టం చేసింది. దీంతో భారతి సిమెంట్స్ లీజులు గందరంగోళంగా పడ్డాయి. 2017లో ఏపీ ప్రభుత్వం రఘురామ్ సిమెంట్స్ కు ఇచ్చిన ప్రాథమిక అనుమతిని రద్దు చేసింది.
జగన్ అధికారంలోకి వచ్చాక లీజులను మళ్లీ తన కంపెనీ పేరుతో లీజులను పునరుద్ధరించుకునేందుకు ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని, అడ్వకేట్ జనరల్ ను పావుగా వాడుకున్నారు. న్యాయసలహా అంటూ లీజుల్ని పునరుద్ధరించేసుకున్నారు. నిబంధనలను అనుసరించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినా న్యాయసలహా పేరుతో లీజుల్ని పునరుద్ధరించుకున్నారు. ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలోనే లీజుల్ని పునరుద్ధరిస్తూ జీవోలు జారీ చేశారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు వెళ్లింది. కేంద్రం విచారణ చేయాలని రాష్ట్రానికి లేఖ రాసింది. అసలు విషయం బయటకు వచ్చింది. భారతి సిమెంట్స్ ను.. ప్రొడక్షన్ ప్రారంభం కాక ముందు 51శాతం వాటాను రెండువేల కోట్లకు వికాట్ అనే కంపెనీకి అమ్మేశారు. కానీ యాజమాన్యం ఇంకా జగన్ కుటుంబం చేతుల్లోనే ఉంది.
