నవీన్ పొలిశెట్టి 2026 సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్ . మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నవీన్ ఓ పాట పాడిన సంగతి తెలిసిందే, ఇప్పుడీ పాట బయటికి వచ్చింది. ‘చాట్ జీపీటీ.. ఎవరీ బ్యూటీ’ అంటూ మొదలైన ఈ పాట మాస్ కి కనెక్ట్ అయ్యేలే కంపోజ్ చేశారు మిక్కీ జె. మేయర్.
చాట్ జీపీటీ.. ఎవరీ బ్యూటీ.. ఇంతందంగా వుందెంటి హాయ్
డ్రెస్సులు ఒక్కోటి.. వెలకడితే కోటి.. ఏ కిస్కి భేటీ హై
లాగ్ అంటూ లేని నీ స్వాగ్ కి.. పడిపోనా ఏంటి హాయ్
కారేమో బెంజి.. ప్యారెము జెన్జీ
భీమవరం బాలమా
బాగ బీచ్ పోదామా
మీద మీద ఫాలుమా
వైరల్ అవుతుంది రీల్
గుండెల్లో నన్ను ట్యాగ్ చేయమా… ఇలా ట్రెండీగా సాగే లిరిక్స్ రాశారు చంద్రబోస్. పాట గాడిగా కూడా నవీన్ పాస్ మార్కులు పడిపోతాయి. ఆయన వాయిస్ ఒక ప్రత్యేకతని జోడించింది. నవీన్, మీనాక్షీ డ్యాన్సులు కూడా అలరించాయి. ఈ సాంగ్ జనాల్లోకి వెళ్ళేలానే వుంది.