భూమన కరుణాకర్ రెడ్డికి ఎలాంటి వ్యాపారాలు లేవు. ఒకప్పుడు ఆయన జిరాక్స్ షాపు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు. మరి ఇప్పుడు ఆయనకు వందల కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ?. టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు, తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు, పదవుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుందని టీడీపీ నేత పట్టాభిరాం ప్రశ్నిస్తున్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి అనుచరులు ..పవన్ అనే దళిత యువకుడ్ని చితక్కొట్టిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దాంతో ఆ పవన్ ను అదృశ్యం చేశారు. పోలీసులు సీరియస్ గా తీసుకోవడంతో ఆ పవన్ తో ఓ వీడియో రిలీజ్ చేయించారు. తాను ఉద్యోగాల పేరుతో మోసం చేసినందునే కొట్టారని..రాజకీయాలకు సంబంధం లేదన్నారు. అతడిని కొట్టడమే కాదు..కిడ్నాప్ చేసి ఇలా వీడియోలు తీయించి విడుదల చేయడంపై పోలీసులు మరింత సీరియస్ అయ్యారు. దాంతో ఆ పవన్ ను చిత్తూరు వద్ద వదిలిపెట్టి భూమన అనుచరులు లొంగిపోయారు.
కొట్టింది భూమన అనచరులు.. ఆ కుటుంబాన్ని భయపెట్టి.. వీడియో బయటకు వచ్చే సిరికి డ్రామాలు ఆడించడం ప్రారంభించారు. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోంది. భూమన అనుచరుల ఆగడాలు శృతి మించడంతో కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు సీరియస్ గా ఈ కేసుపై దృష్టి సారించారు.
భూమన స్వర్ణముఖి నది ఒడ్డున భూమిని ఆక్రమించారని ఇటీవల దర్యాప్తులో తేలింది. అలాగే టీడీఆర్ బాండ్ల పేరుతో తిరుపతిలో వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటిపై చర్యలు తీసుకుంటామని పట్టాభి ప్రకటించారు. తిరుపతి పట్టణంలో భూమన అసాంఘిక శక్తులతో కలిసి దందాలు చేస్తున్నారని మండిపడ్డారు.