తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీయడానికి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన పార్టీకి చెందిన వర్గం చేయని తప్పుడు ప్రచారాలు లేవు. తాజాగా ఆయన అలిపిరి దగ్గర మూసేసిన శిల్పశాల వద్ద పడేసి ఉన్న ఓ శనీశ్వరుడి విగ్రహంతో రాజకీయాలు ప్రారంభించారు. చాలా ఏళ్లుగా అక్కడే ఉన్న విగ్రహం వద్దకు పొద్దున్నే కెమెరాలతో పోయిన భూమన కరుణాకర్ రెడ్డి .. వీడియోలు షూట్ చేసుకుని.. విష్ణుమూర్తి విగ్రహం టీటీడీ అక్కడ పడేసిందని ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
అలిపిరి దగ్గర గతంలో ఒక ప్రవేటు శిల్పి క్వార్టర్స్ ఉండేది పట్టు కన్నయ్య అనే శిల్పి దాన్ని నిర్వహించేవాడు. బెంగళూరు కి చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడు విగ్రహం ఆర్డర్ ఇచ్చాడు. శిల్పం తయారీలో లోపం రావడంతో…..ఆ రాతివిగ్రహం అక్కడ పడేశారు. గత పదేళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. భూమనకూ తెలుసు. తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే దేవుడితో తప్పుడు ప్రచారాలు ఎలా చేయాలో భూమనకు బాగా తెలుసు. అందుకే ప్రచారం ప్రారంభించారు.
టీటీడీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనీశ్వరుడి విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో శ్రీవారి ఆలయంలోని రాములవారి ఉత్సవవిగ్రహానికి వేలు విరిగిపోయింది..మూడున్నర సంవత్సరాలు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాములవారి విగ్రహానికి ఆగమశాస్త్రం ప్రకారం మరమ్మత్తు చేశారం.. స్వామివారి పట్ల ఇంత నిర్లక్ష్యం ఉన్న నువ్వా..? హిందుత్వం గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. తమ దేవుడి గొప్పతనం కోసం.. మత మార్పిళ్లు కోసం ఇలా కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి.