విభజన చట్టాన్ని పక్కన పడేసిన కేంద్ర కేబినెట్!

విభజన చట్టాన్ని పక్కన పడేసిన కేంద్ర కేబినెట్!
నోరుపెగలని రాష్ట్రం -తెలుగుదేశం

ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసిన కేంద్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు చట్టబద్ధంగా రావలసిన హక్కుల్ని కూడా పక్కకి నెట్టేసింది.

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చెప్పిన మాటలను ఏడు నెలల తరువాత కేంద్రకేబినెట్ బుధవారం ఆమోదించడం మినహా కొత్తగా ఒరగబెట్టింది ఏదీ లేదు.

పాలనా సంబంధమైన ఈ నిర్ణయాన్ని ”ప్రత్యేక హోదాకు చట్టబద్ధత” అనే బ్రేకింగ్ న్యూసులతో టివిలు అఙ్ఞానాన్ని ఘనంగా చాటుకున్నాయి. తప్పిదానికి సిగ్గుపడి ఆ ఆప్రస్తావనే లేకుండా పొడిపొడిగా వార్తని చదివేసి ఊరుకున్నాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలన్నది విభజనచట్టంలో క్లాజు. బుధవారం నాటి కేబినెట్ సమావేశం కూడా నబార్డు ద్వారా ఆ సహాయం చేయడానికే అంగీకరించింది. తాజా అంచనాల ఈ నిర్మాణవ్యయం 42 వేల కోట్ల రూపాయలు అని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. మారిన అంచనాలను ఇప్పటికీ కేంద్రానికి పంపి ఆమోదం తీసుకోనేలేదు. ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై అకౌంట్లు కూడా కేంద్రానికి రాష్ట్రం అందజేయలేదు.

ఈ నేపధ్యంలో ప్రాజెక్టులో ఇరిగేషన్ కంపోనెంటుకి మాత్రమే కేంద్రం సాయంచేస్తుందన్న కేబినెట్ నిర్ణయాన్ని బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టుపై డిల్లీ నుంచి పెద్దగా నిధులు రాకపోవచ్చన్నది ప్రాజెక్టు ఇంజనీర్ల అభిప్రాయం.

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రప్రభుత్వానికి పారిశ్రామిక రంగం అభివృద్దీ విస్తరణలకు 90 శాతం గ్రాంటులు రావలసి వుంది. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఇది 60 శాతానికి తగ్గిపోతుంది. మిగిలిన 30 శాతం మొత్తాన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విదేశీ సంస్ధల రుణాలను 2015 నుంచీ ఐదేళ్ళ పాటు కేంద్రప్రభుత్వమే తీర్చడం ద్వారా సర్దుబాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ విధంగా తానే చెల్లించవలసిన మొత్తం ఏడాదికి 3 వేలకోట్లరూపాయల చొప్పున ఐదేళ్ళకీ 15 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పటికే రెండేళ్ళు గడచింది. మిగిలిన మూడేళ్ళలో విదేశీ రుణాలు తీసుకోడానికి కేంద్రం అనుమతి వుండాలి. ఇప్పటికే తెచ్చుకున్న విదేశీ రుణాలపై వాటి వినియోగంపై లెక్కలు చెప్పి 6 వేలకోట్ల రూపాయలు రాబట్టుకోవలసి వుంది.

మంత్రి పార్లమెంటులో చెప్పిన విషయాలు కేబినెట్ లోకి రావడానికే 7 నెలలు పట్టింది. అకౌంట్ ఇచ్చి విదేశీ రుణం పై అనుమతులు సాధించడం పెద్దప్రొసీజర్. బిజెపి ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేయడమే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం అడిగినవి చేయగల రాజకీయ వాతావరణం కూడాలేదు.

కేబినెట్ నిర్ణయమన్నది అంతా పద్ధతిగా చేశారు అనిపించుకోడానికే తప్ప అందులో ఆచరణాత్మకమైన సమస్యలు వున్నాయి. రెండు పార్టీలు, ప్రభుత్వాల మధ్య రాజకీయ సామరస్యం వుంటేనే ఫైళ్ళు పరుగులు తీస్తాయి. లేకపోతే పరిశీలన సాగుతూనే వుంటుంది.

అన్నిటికీ మించి స్పెషల్ ప్యాకేజీ ని కేబినెట్ ఆమోదించడం అంటే అది ఉన్నత స్ధాయి నిర్ణయమే తప్ప చట్టం కాదు. దీనిపై మీడియా విశ్లేషణలు చేయకపోవడం దారుణం..రాష్ట్రప్రభుత్వమో తెలుగుదేశమో నోరు మెదపకపోవడం మరీ అన్యాయం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చేశారు..!

వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా..ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు. ఎప్పటిలాగే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీలోని కొంత మంది వ్యక్తులు కూడా...

ఎస్ఈసీ ఆర్డినెన్స్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ సర్కార్..!

ఎస్ఈసీ అర్హతలు మార్చుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ...ఎస్ఎల్పీ దాఖలు...

శంకించొద్దు.. జగన్‌కు విధేయుడినే : విజయసాయిరెడ్డి 

తాను చనిపోయేవరకు జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. నన్ను శంకించాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వైఎస్ జగన్ కు... అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్న ఆయన...

అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్...

HOT NEWS

[X] Close
[X] Close