‘సైరా’కి హ్యాండిచ్చిన సూప‌ర్ స్టార్‌

‘సైరా’ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇప్పటికే టీజ‌ర్‌, ట్రైల‌ర్ వ‌చ్చేశాయి. రేప‌టి నుంచి ప్ర‌మోష‌న్ల హ‌డావుడీ మొద‌లైపోతోంది. అక్టోబ‌రు 2 లోపుగా వీలైనంత ప్ర‌చారం చేసుకోవాల‌ని భావిస్తోంది చిత్ర‌బృందం. ఆదివారం జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఒక్క‌టే.. హైద‌రాబాద్ లో జ‌రిగే ఏకైక వేడుక‌. చెన్నై, బెంగ‌ళూరు, కొచ్చిల‌లోనూ కొన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. వీటిలో ఏ ఒక్క‌దానికైనా బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని తీసుకురావాల‌ని సైరా టీమ్ భావించింది. అయితే.. బిగ్ బీ మాత్రం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేదు. బిగ్ బీ అరోగ్యం స‌రిగా లేద‌ని, అందుకే ఆయ‌న ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వ్వ‌డం లేద‌ని `సైరా`టీమ్ చెబుతున్నా – `ప్ర‌మోష‌న్ల‌కు రాను` అని అమితాబ్‌బ‌చ్చ‌న్ ముందే సైరా బృందానికి చెప్పిన‌ట్టు టాక్‌. ఇక న‌య‌న‌తార సంగ‌తి స‌రేస‌రి. త‌ను ప్ర‌మోష‌న్ల‌కు దూరంగా ఉంటుంది. సైరా కైనా ఆమెను తీసుకురావాల‌ని చిత్ర‌బృందం భావించింది. అయితే ఇప్పుడు న‌య‌న‌తార కూడా అందుబాటులో లేకుండా పోయింది. వీళ్లిద్ద‌రూ లేకుండానే సైరా ప్ర‌మోష‌న్లు మొద‌లుకాబోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close