ఇండియాలో సెకండ్ హ్యాండ్ ఐ ఫోన్లు అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలని కొన్నాళ్ల కిందట భారత ప్రభుత్వాన్ని టిమ్ కుక్ కోరారు. కేంద్రం అంగీకరించలేదు. టిమ్ కుక్ అలా అడగడానికి కారణం ఉంది.. అదేమింటంటే భారతీయులు కొత్త ఫోన్లను కొనలేకపోతున్నారని అందుకే డిమాండ్ పెరగడం లేదని అనుకున్నారు. కానీ ఐదారేళ్లలో మొత్తం మారిపోయింది. ఇప్పుుడు ఐ ఫోన్ లాంచ్ చేస్తే.. స్టోర్ల ముందు పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి.
ఐ ఫోన్ 17 మోడల్స్ లాంచ్ చేయగానే పెద్ద ఎత్తున యువకులు స్టోర్ల ముందు పడిగాపులు పడ్డారు. ముంబై, ఢిల్లీల్లోని యాపిల్ స్టోర్ల ముందు తొక్కసిలాట కూడా జరిగింది. కొంత మంది కొట్టుకున్నారు. అదేమైనా డిస్కౌంట్ లో వస్తున్నఫోనా అంటే కాదు.. కనీసం లక్ష రూపాయలు పెడితే వచ్చే ఫోన్. అంటే అక్కడ క్యూలో నిల్చున్న వారంతా లక్ష రూపాయుల పెట్టి ఐ ఫోన్ కొనడానికి లైన్లో ఉన్నారు. తాము అర్థరాత్రి నుంచి లైన్ లో ఉన్నామని గొప్పగా చెప్పుకున్నారు.
గతంలో ఎక్స్ బాక్స్ వంటి వాటి కోసం అమెరికాలో ఇతర దేశాల్లో ఇలా క్యూలు ఉండేవి. కానీ ఇండియాలో తక్కువ. ఆ పరిస్థితిని ఐ ఫోన్ తీసుకు వచ్చింది. నిజానికి ఐ ఫోన్ అక్కడ మాత్రమే అమ్మడం లేదు. బిగ్ బాస్కెట్ లాంటి చోట్ల.. ఆర్డర్ ఇస్తే పది నిమిషాల్లో ఇంటికి తెచ్చి ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంది. అయినా కొంత మందికి దుకాణాల్లో అలా తోసుకెళ్లి మరీ కొనుగోలు చేయడం ప్యాషన్. మొత్తానికి ఇండియాలో అభివృద్ధి చెందిన వర్గం పెరుగుతోందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చేమో. ?