బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్ మొద‌లు కాబోతోంది. ఈనెల‌లోనే బిగ్ బాస్ 4కి తెర లేస్తుంద‌ని భావించారంతా. కానీ.. కాస్త ఆల‌స్యంగా బిగ్ బాస్ మొద‌లు కాబోతోంది. ఆగ‌స్టులో కాకుండా, సెప్టెంబ‌రులో ఈ షో ని ప్రారంభించ‌బోతున్నారు. సెట్ కి సంబంధించిన కొన్ని ప‌నులు పెండింగ్ లో ఉన్నాయ‌ని తెలుస్తోంది. దాంతో పాటు.. కంటెస్టెంట్ల‌ను 14 రోజుల హోం క్వారెంటైన్‌లో ఉంచాల‌న్న నిబంధ‌న ఉంది. హోం క్వారెంటైన్ లో ఉన్న త‌ర‌వాత కొవిడ్ ప‌రీక్ష‌ల్ని మ‌ళ్లీ నిర్వ‌హిస్తారు. ఆ ప‌రీక్ష‌ల్లో నెగిటీవ్ వ‌చ్చిన త‌ర‌వాతే.. షో ప్రారంభం కాబోతోంది. ఇదంతా జ‌ర‌గ‌డానికి టైమ్ ప‌డుతుంది. అందుకే.. షో ఆలస్యంగా ప్రారంభం కానుంది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ 4 అఫీషియ‌ల్ డేట్ ని ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ షోలో పాల్గొనే సెల‌బ్రెటీల లిస్టు ఆల్రెడీ లీక్ అయిపోయింది. అయితే.. అందులో ఎవ‌రెవ‌రు చివ‌రి జాబితా వ‌ర‌కూ ఉంటార‌న్న‌ది సందేహ‌మే. బిగ్ బాస్ నుంచి అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేంత వ‌ర‌కూ… సెల‌బ్రెటీల‌ను ఊహించ‌డం క‌ష్ట‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close