రొమాన్స్, భావోద్వేగాలతో అదిరిపోయిన ‘బిగ్‌బాస్’

బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభంలోనే రసవత్తరంగా సాగుతోంది. ఎపిసోడ్ 3లో హౌస్‌లో సభ్యులు రెండో రోజు ఎలా గడిపారో ప్రసారం చేశారు. సభ్యులు ఇంట్లోకి వచ్చీ రాగానే బిగ్ బాస్ ఆరుగురు సభ్యుల్ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే నామినేషన్‌ ప్రక్రియ తప్పించుకోవడానికి వీలు కల్పించాడు బిగ్ బాస్. అందులో భాగంగా ఫస్ట్ కంటెస్టెంట్‌గా రాహుల్‌ ఎంటరయ్యారు. నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు ఫస్ట్ ఛాన్స్ రాహుల్‌కు వచ్చింది.

మొదటిసారి బెల్‌ మోగిన వెంటనే శివజ్యోతి పేరును బిగ్ బాస్‌కు చెప్పాడు. తన ప్లేస్‌లో శివజ్యోతి రీప్లేస్‌ చేయాలని కోరాడు. అందుకు గల కారణాలు కూడా వివరించాడు రాహుల్. కానీ అవి సరిగ్గా లేకపోవడంతో రాహుల్‌నే మళ్లీ నామినేట్‌ చేసింది మానిటర్ హేమ. టాస్క్‌లో భాగంగానే శివజ్యోతి రాహుల్‌ను నామినేట్ చేసిందని, ఆమెకు ఇచ్చిన టాస్క్‌ను న్యాయంగా చేసిందని అందుకోసం శివజ్యోతిని సేవ్‌ చేయాలని బిగ్‌బాస్‌ను కోరింది హేమ. మొత్తానికి రాహులే మళ్లీ నామినేట్ అయ్యాడు.

రెండోసారి బెల్‌ మోగిన వెంటనే వరుణ్‌ సందేశ్‌ సీన్‌లోకి ఎంటరయ్యారు. తాను పునర్నవిని నామినేట్‌ చేస్తున్నట్లు చెప్పాడు. పెద్దగా కారణాలు ఏమీ లేవుగానీ, ఆమె హౌస్‌లో అందరితో సరిగ్గా కలిసిమెలిసి ఉండడం లేదని, ఒంటరిగా ఉంటుందని కారణం చెప్పాడు వరుణ్. అలాగే ఇంటి పనుల్లోనూ అంతగా ఇన్వాల్వ్‌ కావడం లేదంటూ కారణం చెప్పాడు. పునర్నవి ఏదో తన ప్రపంచంలో తాను గడిపేస్తుందన్నాడు. ఈ కారణాల వల్లే తనను నామినేట్ చేయాలనుకుంటున్నానని వరుణ్ హేమ, బిగ్ బాస్‌కు వివరించాడు.

అయితే తాను ఒంటిరిగా ఉండడం లేదని, అందరితో కలిసే ఉంటున్నాని, తనకు అప్పజెప్పని పనులు కూడా చేస్తున్నాననంటా పునర్నవి వివరించారు. మొదట్లో కాబట్టి కాస్త అప్పుడప్పుడు ఒంటరిగా ఉంటూ ఉంటాను. అలా అని హౌస్‌లో ఎవరితో సంబంధం లేకుండా నా లోకంలో నేను ఉండడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది పునర్నవి. అయితే ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు విన్న మానిటర్ హేమ వరుణ్‌ సందేశ్‌ను సేవ్‌ చేసి, పునర్నవిని నామినేట్‌ చేసింది.

ఇక మూడో బెల్‌కు వితికా తన అభ్యర్థన తెలిపారు. తనకు బదులుగా అషూరెడ్డిని రీప్లేస్‌ చేయాలనుకుంటున్నాని వితికా చెప్పింది. తను అందరితో సరిగ్గా కలవడం లేదంటూ, తాను కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పింది.

అయితే అషూరెడ్డి మాత్రం తాను అందరితో అంత త్వరగా కలవలేనని చెప్పింది. తాను ప్రతి పని చేస్తున్నానని, మరికొన్ని రోజుల్లోనే అందరితో తాను కలిసిమెలిసి ఉంటానని వివరించి అషూ. తాను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండాలని కోరుకుంటున్నానని అషూ చెప్పింది. ఆమె ఇచ్చిన వివరణ సరిగ్గా ఉండడంతో అషూను సేవ్ చేసి వితికాను నామినేట్‌ చేసింది మానిటర్ హేమ.

తర్వాత కొద్ది సేపటికి నాలుగో బెల్‌ మోగింది. దీంతో శ్రీముఖి తన అభ్యర్థన తెలుపుకునేందుకు ఎంటరైంది. తన ప్లేస్‌లో హిమజను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని శ్రీముఖి చెప్పింది. మానిటర్‌ హేమ లివింగ్ రూమ్‌లో పెట్టిన బోర్డ్‌పై కొన్ని పేర్లు రాసింది అందులో తనకు ఒక రెడ్‌ మార్క్‌ ఉందని, ఆ రెడ్‌ మార్క్‌ వల్లే హిమజను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని శ్రీముఖి తెలిపింది. కేవలం ఆ బోర్డ్ వల్లే నేను హిమజను రీప్లేస్ చేయాలనుకుంటున్నాని చెప్పింది. తనకు హిమజ బాగా తెలుసని, అలాగే హిమజ తన లైఫ్‌లో అన్నీ లైట్‌గా తీసుకుంటుందని శ్రీముఖి వివరించింది.

అయితే శ్రీముఖి చెప్పిన కారణాలన్నీ హిమజకు కోపం తెప్పించాయి. ‘‘ నా పర్సనల్ లైఫ్ గురించి నీకెమీ తెలుసు. నువ్వు నాకు స్క్రీన్ ముందుకు వచ్చాక తెలుసు.’’ అంటూ హిమజ కాస్త కోప్పడింది. అయితే తన మనస్సు నొప్పించి ఉంటే సారీ అంటూ శ్రీముఖి వివరణ ఇచ్చింది. అయినా తను లైఫ్‌లో ఏది లైట్‌గా తీసుకోననంటూ హిమజ ఏడ్చింది. హేమ తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది. హిమజను నామినేట్‌ చేసి శ్రీముఖిని సేవ్‌ చేసింది.

హేమ శ్రీముఖిని సపోర్ట్ చేయడంతో, హిమజకు మళ్లీ కోపం వచ్చింది. నేను తప్పు చెబితే జనాలు నన్ను తిట్టుకుంటారు అని హేమ చెప్పగా, మీరు నిందలు యాక్సెప్ట్ చేస్తారేమోగానీ, నేను నిందలు యాక్సెప్ట్ చేయను అంటూ హిమజ హేమతో గట్టిగా వాదించింది. రూల్స్ అందరికీ ఒక్కటేనంటూ అరిచింది. కానీ, హేమ మాత్రం శ్రీముఖి బదులుగా హిమజనే ఎలిమినేషన్‌కు నామినేట్ చేసింది.

చివరగా జాఫర్‌ తన అభ్యర్థన చెప్పారు. తనకు బదులుగా మహేష్‌ విట్టాను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని చెప్పారు. మహేష్ కంటే తాను బెటర్‌ పర్ఫామెన్స్‌ ఇస్తానన్నాడు జాఫర్. అయితే తాను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండాలనుకుంటాననే కారణాలను మహేష్‌ వివరించాడు. తాను యువకుడినని ఏ ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినా బాగా చేస్తానని, తనకు అంతగా ఎమోషన్స్ కూడా లేవంటూ కారణాలు వివరించాడు మహేష్. చివరగా జాఫర్‌ను నామినేట్‌ చేస్తూ మహేష్‌ను సేవ్‌ చేసింది హేమ.

అయితే ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండగా ఐదుసార్లు మాత్రమే బెల్‌ మోగుతుందని బిగ్ బాస్‌ చెప్పాడు. దీంతో బాబా భాస్కర్‌కు అవకాశం రాలేదు. అయితే బిగ్ బాస్ హేమ, బాబా భాస్కర్‌ ఇద్దరిలో ఒకరిని నామినేట్‌ చేయాలని ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఇంటి సభ్యులంతా బాబా భాస్కర్‌ను సేవ్‌ చేశారు. హేమను నామినేట్‌ చేశారు. మొత్తానికి రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్‌, హేమ నామినేట్‌ అయ్యారు. వీరందరిలో ఎవరో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది.

వరుణ్ సందేశ్, వితికాల రొమాన్స్ :

ఒక పక్క నామినేషన్ రీప్లేస్ జరుగుతూ రసవత్తరంగా మారిన హౌస్‌లో మరోపక్క వరుణ్, వితికాల రొమాన్స్ కూడా ఆకట్టుకుంది. వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికాతో అవకాశం దొరికినప్పుడల్లా రొమాన్స్ చేస్తూ ముద్దుముద్దుగా మాట్లాడిన సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బెడ్ రూమ్‌లో వరుణ్ పక్కనే ఓ బెడ్‌పై మహేష్ విట్ట పడుకోని ఉన్నాడు. అక్కడ ఇంకెవ్వరూ లేకపోవడంతో ఈ భార్యాలిద్దరూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. కెమెరా మనవైపే చూస్తుందంటూ వితిక రొమాన్స్‌కు పుల్ స్టాప్ పెట్టేసింది. అలాగే ఉదయాన్నే ‘బంబోలేగుందిరా పోరీ’ అనే సభ్యులంతా హుషారుగా స్టెప్పులు వేశారు. ఇక ఇంటి సభ్యులందరికీ బాబా భాస్కర్ మాస్టర్ దిష్టి తీసే విధానం హైలెట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close