మోడికి రెండో ఎదురుదెబ్బ! – బీహార్‌లో మహాకూటమి ఘన విజయం!

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడికి రెండో ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికలలో విజయఢంకా మోగించి ఎర్రకోటలో పాగా వేసిన మోడికి మొదటి దెబ్బ ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఎన్నికల రూపంలో మొదటి దెబ్బ తగలగా, రెండో ఎదురుదెబ్బ ఇవాళ బీహార్ ఎన్నికలలో తగిలింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ మెల్లిగా స్పష్టమవుతోంది. జేడీయూ-ఆర్‌జేడీ-కాంగ్రెస్ పార్టీల మహాకూటమికే మెజారిటీ లభించనున్నట్లు తెలుస్తోంది. తొలి రౌండ్స్‌లో ఎన్‌డీఏ ముందంజలో ఉన్నట్లు కనిపించినప్పటికీ, పోను పోనూ, పోటీ హోరా హోరీగా మారింది. ఒకసారి ఎన్‌డీఏ, ఒకసారి మహాకూటమి ముందంజలో ఉన్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత చూస్తే మహాకూటమి ముందుకు దూసుకెళ్ళిపోయింది. జాతీయ ఛానల్స్‌లో హోరా హోరీగా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ, బీహార్ స్థానిక ఛానల్స్ మహాకూటమిదే విజయమని తేల్చేశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి 122 స్థానాలు కావాల్సి ఉండగా, జేడీయూ కూటమి ఆ మేజిక్ ఫిగర్‌ను ఎప్పుడో దాటేసి బంపర్ మెజారిటీ సాధించింది.

నరాలు తెగే ఉత్కంఠ మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. మొత్తం 243 స్థానాల లెక్కింపును 39 కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కౌంటింగ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ, తాము గెలవబోతున్నట్లు చెప్పారు. రాత్రి హాయిగా నిద్రపోయానని అన్నారు. మరోవైపు నితీష్ మాట్లాడుతూ, తనకేమీ టెన్షన్ లేదని, ఇలాంటివి చాలా చూశానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌డీఏ నాయకుడు మాంఝీ మాట్లాడుతూ, సీఎం పదవి తీసుకోమంటే తాను తీసుకుంటానని అన్నారు. రెండు కూటములూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహా కూటమి గెలిస్తే నితీషే ముఖ్యమంత్రి అవుతారని, జేడీయూకు, తమకూ మధ్య పొరపొచ్చాలేమీ లేవని ఆర్‌జేడీ నేతలు ఈ ఉదయం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌‌లో ఒక్కొక్క సంస్థ ఒక్కో రకంగా ఫలితాలను ఇచ్చాయి. మొత్తంమీదచూస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలైతే ఏకపక్షంగా లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close