మారిన బీహార్..! అవినీతి కేసులున్నాయని 3రోజులకే మంత్రి రాజీనామా..!

అవినీతి ఆరోపణలు ఉన్నాయని పదవి చేపట్టిన మూడు రోజులకే బీహార్ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. బిహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. మూడు రోజుల కిందట బిహార్‌లో కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్‌ చౌదరికి విద్యా శాఖను కేటాయించారు. అయితే.. ఆయనపై గతంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మేవాలాల్.. గతంలో ఓ యూనివర్శిటీకి వీసీగా పని చేశారు. ఆ సమయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. లంచం తీసుకుని అర్హతలేని వారికి యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, జూనియర్‌ శాస్త్రవేత్తలుగా నియమించారనే ఆరోపణలపై విచారణ కూడా జరుగుతోంది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. నేరమయమైన కేబినెట్‌ను ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.

అదే సమయంలో… ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మేవాలాల్‌ జాతీయ గీతం తప్పుగా ఆలపించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేయాలని సీఎం నితీష్ కోరారు. ఆయన పదవి నుంచి వైదొలిగారు. బీహార్ అంటే.. నిన్నామొన్నటిదాకా నేరమయ రాజకీయ నేతలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు.. అవినీతి ఆరోపణలు ఉన్న వారు నైతిక బాధ్యతగా.. రాజీనామాలు కూడా చేస్తున్నారు. అలాంటి వారు కేబినెట్‌లో ఉన్నందుకు ముఖ్యమంత్రులు కూడా సిగ్గుపడుతున్నారు. విమర్శలు వచ్చిన తర్వాతైనా వారిని తొలగించడానికి వెనుకాడటం లేదు.

కానీ.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలు కాదు.. వేల కోట్లకు సంబంధించి సీబీఐ ఈడీ కేసుల దగ్గర్నుంచి పేకాట క్లబ్‌లు.. ఈఎస్ఐ స్కాంలో నిందితుల నుంచి గిఫ్టులుగా లంచాలు తీసుకున్న వారి వరకూ చాలా మంది ఉన్నారు. కానీ.. ఎవరూ కూడా.. నైతిక బాధ్యత తీసుకోవడం లేదు. అవినీతి ఆరోపణలు రావడాన్ని గొప్పగా భావించే పరిస్థితి వచ్చేసింది. కానీ బీహార్ మాత్రం మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close