శర్వానంద్ కొత్త సినిమా బైకర్. అభిలాష్ రెడ్డి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. మోటోక్రాస్ అడ్వంచరస్ జానర్ లో రూపొందుతున్న చిత్రమిది. రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ట్రైలర్ వదిలారు. ఇండియన్ రేసర్లు ప్రపంచ స్థాయి ట్రాక్స్ పై నిలబడగలరా? ఒక ఫారిన్ స్పోర్ట్స్ యాంకర్ ప్రశ్నించడంతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైయింది. విక్కీ(శర్వా) ఓ రేసర్. అతనికి శిక్షణ ఇచ్చేది స్వయంగా తండ్రి రాజశేఖర్. ఈ ఇద్దరి మధ్య వున్న ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఈ కథకు కీలకం.
బేసిగ్ గా ట్రైలర్ అంటే హీరో డైలాగులు పేలుతాయి. కానీ బైకర్ కాస్త భిన్నంగా వుంది. ట్రైలర్ మొత్తంలో శర్వా పలికిన డైలాగులు రెండే. కాకపోతే ఆ డైలాగుల్లో కథకు కావాల్సిన ఎమోషన్ వుంది. అలాగే రాజశేఖర్ పాత్ర కూడా బలంగా వుంది. శర్వా రేసర్ పాత్రలో ఒదిగిపోయాడు.
టెక్నికల్ గా ట్రైలర్ బలంగా వుంది. జె యువరాజ్ కెమెరా వర్క్, జిబ్రాన్ బీజీఎం కథకు కావాల్సిన మోడ్ ని సెట్ చేశాయి. కొత్త దర్శకుడు అభిలాష్ రోటీన్ కి భిన్నంగా మోటార్ రేస్ జానర్ ని ఎంచుకున్నాడు. ఈ జానర్ లో తెలుగు సినిమాలు అరుదు. బైకర్ ఆశించిన స్థాయిలో రాణిస్తే ఈ జానర్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం వుంది. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.


