దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పిలానీ కొత్త క్యాంపస్ అమరాతిలో ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలోని వెంకటపాలెంగ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో క్యాంపస్ ను నిర్మించబోతున్నారు. BITS యాజమాన్యం సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలో ఉన్న 35 ఎకరాల స్థలాన్ని ఎంచుకుంది. ఈ విషయాన్ని బిర్లా గ్రూప్ చైర్మన్ కూమార మంగళం బిర్లా స్వయంగా ప్రకటించారు.
కొత్త క్యాంపస్ కోసం రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెడతారు. తరవాత దశలో రూ. 2,200 కోట్లు వరకూ విస్తరిస్తారు. ఈ పెట్టుబడి రెండు దశల్లో ఖర్చు చేస్తారు. మొదటి దశలో 3,000 మంది విద్యార్థుల కోసం , రెండవ దశలో 7,000 మంది విద్యార్థుల కోసం సౌకర్యాలు కల్పిస్తారు. ఈ క్యాంపస్ AI+ క్యాంపస్ గా పిలుస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్-ఫిజికల్ సిస్టమ్స్‌ల కోర్సులకు ప్రాధాన్యత ఇస్తుంది. అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లతో స్మార్ట్ క్యాంపస్ గా నిర్మిస్తారు. AI, మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజీలో మాస్టర్స్ డిగ్రీ కోర్సులు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో జాయింట్ PhD ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇండస్ట్రీ సహకారంతో ప్రోగ్రామ్స్ ఉంటాయి. రియల్-వరల్డ్ ప్రాజెక్ట్‌లు , ఇంటర్న్‌షిప్‌లు ఉంటాయి.
క్యాంపస్ ను సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో నిర్మిస్తారు. ఇందులో 100 శాతం రీసైకిల్డ్ వాటర్ వినియోగం, ఎనర్జీ-సేవింగ్ లైటింగ్, సోలార్ పవర్ ఉంటాయి. రీసెర్చ్ సెంటర్స్, గ్లోబల్ కొలాబరేషన్ జోన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్‌లు క్యాంపస్‌లో భాగంగా ఉంటాయి. క్యాంపస్ ప్రవేశాలు 2027 నుండి ప్రారంభమవుతాయని అంచనా.
అమరావతిలో ఇప్పటికే SRM, VIT, అమృత విశ్వవిద్యాపీఠం, NID, AIIMS వంటి ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. XLRI, నేషనల్ లా యూనివర్సిటీ, CITD వంటి సంస్థలు కూడా భాగమవుతున్నాయి. మరిన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కూడా రానున్నాయి.