బీజేపీ డేంజరస్ అని కేటీఆర్‌కి తెలిసొచ్చిందా..?

భారతీయ జనతా పార్టీని.. టీఆర్ఎస్ ప్రెసిడెంట్.. వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్నామొన్నటి వరకు సీరియస్‌గా తీసుకోలేదు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కుడుంటుందన్నారు. తెలంగాణ సమాజం.. బీజేపీ భావజాలానికి ఆకర్షితులయ్యే అవకాశమే లేదని.. చెబుతూ వచ్చారు. అయితే.. మారుతున్న పరిస్థితులతో… బీజేపీని మరీ అంత తేలిగ్గా .. తీసుకోవాల్సిన పరిస్థితి లేదని గుర్తించినట్లుగానే కనిపిస్తోంది. అందుకే.. ఇటీవలి కాలంలో.. కాంగ్రెస్ కన్నా.. బీజేపీపైనే … టీఆర్ఎస్ పెద్దలు గురి పెడుతున్నారు. కేటీఆర్ కూడా.. తమ పార్టీ నేతలకు అదే చెప్పడం ప్రారంభించారు.

తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. బీజేపీ, టీఆర్ఎస్ … రహస్య మిత్రులన్న ప్రచారం ఉంది. దానికి తగ్గట్లుగా… కేంద్రంలో టీఆర్ఎస్… రాష్ట్రంలో బీజేపీ.. పరస్పరం సహకరించుకున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో.. ఒక్క సారిగా.. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత మార్పు వచ్చింది. టీఆర్ఎస్ కంచుకోటల్ని… బీజేపీ బద్దలు కొట్టి.. నాలుగు పార్లమెంట్ సీట్లలో విజయం సాధించడంతో… ఆ పార్టీ హంగామాకు హద్దు లేకుండా పోయింది. ఇక అధికారం చేపట్టడమే తరువాయన్నట్లుగా… బీజేపీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీకి అర్బన్ ప్రాంతాల్లో కాస్తంత పట్టు ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. వలసలతో కుదేలైపోయిన కాంగ్రెస్ కంటే బీజేపీ దూకుడుతో వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తోన్న కమలదళం… టీఆర్ఎస్ నేతల పైనా నజర్ పెట్టింది. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో పాటు రామగుండానికి చెందిన పలువురు కార్పోరేటర్లకు కాషాయ కండువాలు కప్పారు ఆ పార్టీ నేతలు.

ఈ అంశమే అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోందంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొవటం కోసం సిద్దమైన గులాబీ పార్టీ…బీజేపీ దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలో బలపడే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు మున్సిపాలిటీలతో రాష్ట్రం వ్యాప్తంగా అర్భన్ ఏరియాల్లో ప్రధానంగా దృష్టి సారించింది. దీంతో టీఆర్ఎస్ అగ్రనేతలు కూడా అలెర్ట్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆషామాషిగా తీసుకోవద్దని పార్టీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. బీజేపీ ఒక్క మున్సిపాల్టీ గెలిచినా కాలర్ ఎగరేసే పరిస్థితి వస్తుందన్నారు.

బీజేపీకి ఏ ఒక్కచోట అవకాశం ఇచ్చినా భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని కేటీఆర్ పార్టీ నేతలకు సూచించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు అర్భన్ కేంద్రంగా జరుగుతాయి. బీజేపీకి కూడా పట్టణాలకే పరిమితమైన పార్టీగా పేరుంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ సైతం ఆ ప్రాంతాల్లోనే సభ్యత్వ నమోదుతో ముందుకెళ్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీతోనే మున్సిపల్ ఎన్నికల్లో ముఖాముఖి తలపడాల్సి వస్తోందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కన్నా బీజేపీనే ప్రమాదకర ప్రత్యర్థిగా మారుతుందని.. టీఆర్ఎస్ అగ్రనేతలు.. ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close