ఎంఐఎం సపోర్ట్ తీసుకుని టీఆర్ఎస్.. బీజేపీకి చాన్స్ ఇచ్చిందా..!?

గ్రేటర్ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇలా ఎంఐఎం మద్దతు తీసుకోవడం ఆలస్యం .. అలా భారతీయ జనతా పార్టీ తనదైన రాజకీయాన్ని ప్రారంభించింది. అసలు బీజేపీకి ఎలాంటి చాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఇంత వరకూ టీఆర్ఎస్ .. ఎంఐఎంతో కలిసి మేయర్ సీటును కైవసం చేసుకుంటామని ప్రకటించలేదు. మేయర్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే అంతర్గతంగా మాత్రం చర్చలు జరిగాయి. ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ను కేసీఆర్ ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. అయితే.. వద్దని అనుకున్నారట.

అందుకే.. డిప్యూటీ మేయర్ కూడా టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. ఇద్దరికీ.. ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఇది బీజేపీ ఊహించిందో లేదో కానీ.. మంచి చాన్స్ దొరికిందని.. విమర్శల వర్షం ప్రారంభించారు. పొత్తు లేదని చెప్పుకుని ఇప్పుడు బల్దియాలో కలిసి పాలన ప్రారంభించారని టీఆర్ఎస్‌, ఎంఐఎం అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందని బండి సంజయ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంటుందని.. రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకుంటాయన్నారు.

రాజా సింగ్ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎంతో లింక్ పెట్టడానికి బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గ్రేటర్ మేయర్ పీఠానికి మజ్లిస్ మద్దుత తీసుకోవడం ద్వారా… దానికి బలాన్ని టీఆర్ఎస్సే ఇచ్చినట్లయింది. ఇప్పుడు బీజేపీ నేతలు చేసే పొలిటికల్ ఎటాక్ కు సమాధానం రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్‌పై పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close