ఆశావ‌హుల అర్హ‌త‌లపై భాజ‌పా జాతీయ నాయ‌క‌త్వం ఆరా!

తెలంగాణ రాష్ట్ర భాజ‌పా అధ్య‌క్ష ప‌ద‌వికి తీవ్ర‌మైన డిమాండ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆశావ‌హులు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. అయితే, ఢిల్లీ నుంచి ఒక క‌మిటీ హైద‌రాబాద్ కి వ‌చ్చి, ఎవ‌రికి ప‌ద‌వి ఇవ్వాల‌నే అంశ‌మై దాదాపు 35 మంది నేత‌ల‌తో వ్య‌క్తిగ‌తంగా ఓ మూడ్రోజుల కింద‌టే స‌మావేశ‌మైంది. పాండే, అనిల్ జైన్ అనే నాయ‌కులు దానికి సంబంధించిన నివేదిక కూడా పార్టీ జాతీయ నాయ‌క‌త్వానికి అందించిన‌ట్టు స‌మాచారం. ఈ నివేదిక చూసి.. ఢిల్లీ నాయ‌క‌త్వం కాస్త ఆశ్చ‌ర్యానికి గురైంద‌ని తెలుస్తోంది. రాష్ట్ర అధ్య‌క్షుడి ప‌ద‌వి కోసం ఇంత‌మంది పోటీ పడుతున్నారా? అధ్య‌క్ష ప‌ద‌వి అంటే ఆషామాషీగా భావిస్తున్నారా..? పేర్ల‌ను సూచించే ముందు రాష్ట్ర స్థాయిలో నాయ‌కులు చ‌ర్చించుకోరా, ఏకాభిప్రాయం లాంటిది ఉండ‌దా, రాష్ట్ర నాయ‌క‌త్వం ఏం చేస్తోంది అంటూ కొంత‌మంది నేత‌ల‌కు ఢిల్లీ నుంచి అక్షింత‌లుప‌డ్డ‌ట్టు స‌మాచారం.

ఢిల్లీ నుంచి వ‌చ్చి వెళ్లిన ప‌రిశీల‌కుల‌కు రాష్ట్ర నేత‌లు కొంద‌రు… వారికి ఢిల్లీలో తెలిసిన ప్ర‌ముఖ నేత‌ల‌తో ఫోన్లు చేయిస్తున్నార‌ని తెలిసింది. త‌మ పేరునే ప్ర‌ముఖంగా పార్టీ నాయ‌క‌త్వానికి చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చార‌నీ అంటున్నారు. ఈ ఒత్తిడి భ‌రించ‌లేక‌, స‌ద‌రు క‌మిటీ స‌భ్యులు పార్టీ అధినాయ‌క‌త్వానికి విష‌యం తెలియ‌జేశార‌ని స‌మాచారం. దీంతో, తెలంగాణ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్న‌వారు… త‌మ ప‌రిధిలో ఎన్నెన్ని బూత్ క‌మిటీలు వేశారో, పార్టీ కోసం వాస్త‌వంగా ఏం చేశారో, వారికి ఉన్న అర్హ‌త‌లు ఏంటో తెలుసుకోవాలంటూ స‌ద‌రు క‌మిటీ స‌భ్యుల‌ను పార్టీ అధినాయ‌క‌త్వం కోరింద‌ని అంటున్నారు.

త‌మ పేరును ప‌రిశీలించాలంటూ హైద‌రాబాద్ కి వ‌చ్చిన పరిశీల‌కుల‌ను కూడా బ‌తిమాలుకునే ప‌రిస్థితిలో తెలంగాణ నేత‌లు ఉండ‌ట‌మేంట‌ని ఢిల్లీ నేత‌లు కొంద‌రు వ్యాఖ్యానించిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ నేత‌ల‌కు ప‌ద‌వి విష‌యంలో ఉన్న సీరియ‌స్నెస్… పార్టీ విస్త‌ర‌ణ‌పై పెడితే గ‌డ‌చిన కొన్నాళ్లుగా జ‌రిగిన వ‌రుస ఎన్నిక‌ల్లో ఏదో ఒక దాన్లో మెరుగైన ఫ‌లితాలు సాధించి ఉండేవార‌నే అభిప్రాయం జాతీయ నాయ‌కుల్లో వ్య‌క్త‌మౌతోంద‌ని వినిపిస్తోంది. మొత్తానికి, ఆశావ‌హులంద‌రి అర్హ‌త‌లు ఏపాటివో తేల్చే ప‌నిలో పార్టీ ప‌డింద‌ని భాజ‌పా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇవ‌న్నీ ద‌గ్గ‌రపెట్టుకుని వ‌రుస‌గా క్లాసులు తీసుకుంటారేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close