వైసీపీపై నేతకొక విధానం పాటిస్తున్న బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బీజేపీ విధానం ఏమిటి..?. ఎన్నికలకు ముందు తాము గెలవకపోయినా పర్వాలేదు.. వైసీపీ గెలవాలన్నంత ఆప్తమిత్రులుగా మెలిగారు.. బీజేపీ నేతలంతా. చివరికి… ఢిల్లీ నుంచి అగ్రనేతలంతా ప్రచారానికి వచ్చినా.. టీడీపీని ఓడించమని పిలుపునిచ్చారు కానీ…బీజేపీని గెలిపించమనలేదు. అంటే.. వారు కూడా పరోక్షంగా వైసీపీనే గెలిపించమన్నారు. ఎలా అయితేనేమి… టీడీపీని 30 సీట్లలోపే పరిమితం చేస్తామన్న వారి చాలెంజ్‌ను నిరూపించుకున్నారు. మరి ఇప్పుడు.. వైసీపీతో.. బీజేపీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటే… మాత్రం.. ఎవరూ చెప్పలేకపోతున్నారు. వైసీపీపై బీజేపీ నేతలు… ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు. చోటా నేతలు కాకుండా.. ఏపీ వ్యవహారాలు చూసుకునే.. కన్నా, జీవీఎల్ కూడా.. వైసీపీపై తలో విధానాన్ని అనుసరిస్తున్నారు.

వైసీపీని వెనకేసుకు వస్తున్న జీవీఎల్..!

ఏపీలో టీడీపీతో కటిఫ్ అయిన తర్వాత బీజేపీ వ్యవహారాల్ని.. యూపీ ఎంపీ.. జీవీఎల్ నరసింహారావు దాదాపుగా టేకోవర్ చేశారు. ఆయననే… కేంద్రం తరపున.. జరిగిన అన్ని వ్యవహారాలను… కనుసన్నల్లో నడిపించారన్న అభిప్రాయం ఉంది. ఆయన టీడీపీపై మామూలుగా ఎటాక్ చేయలేదు. ఇప్పుడు.. కూడా.. ఆయన పదును తగ్గించలేదు. అదే సమయంలో.. వైసీపీతో.. ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలన్న.. ఉద్దేశాన్ని ఆయన పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ పరంగా.. జగన్ నిర్ణయాలపై.. తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. పార్టీ పరంగా మాత్రం.. జీవీఎల్..వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంట్రాక్టుల రద్దుకు మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు.

జగన్ పాలనపై దుమ్మెత్తి పోస్తున్న కన్నా..!

మరో వైపు .. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాత్రం…వైసీపీపై ఒంటికాలితో లేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ నిర్ణయాన్ని సమర్థించడం కలకలం రేపుతోంది. కాపు రిజర్వేషన్లను చంద్రబాబు చట్టబద్దంగానే ఇచ్చారని.. అయినా జగన్ రద్దు చేశారని… కన్నా మండి పడుతున్నారు. ప్రస్తుతం.. ఏపీలో జరుగుతున్న పాలనతో.. అంతా.. అస్తవ్యస్తంగా తయారైందని.. కన్నా మండి పడుతున్నారు. అంతా ఆత్రమే జగన్ పాలనలో కనిపిస్తోందంటున్నారు. అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు.

ఇద్దరిలో బీజేపీ విధానం ఏది..?

ఓ వైపు… జీవీఎల్ సాఫ్ట్‌గా.. మరో వైపు .. కన్నా హార్డ్ గా.. వైసీపీపై తమ రాజకీయ విధానాన్ని పాటిస్తున్నారు. మిగతా వారు కూడా.. అటో ఇటో విడిపోయారు. కానీ పాత కాపు నేతలు మాత్రం.. ఈ రాజకీయాలకు ప్రేక్షకులుగానే మిగిలిపోయారు తప్ప.. ఎలాంటి రాజకీయ హడావుడి చేయడం లేదు. సోము వీర్రాజులాంటి నేతలు… జీవీఎల్‌ను ఫాలో అవుతున్నారు. ఇష్టం లేని వాళ్లు.. కన్నా విధానానికి జై కొడుతున్నారు. మొత్తానికి..వైసీపీ విషయంలో బీజేపీలో క్లారిటీ లేదన్న అంచనాలు మాత్రం వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close