ఏపీ నేతలతో బీజేపీ పొలిటికల్ గేమ్

దేశంలో బీజేపీ అత్యంత బలహీనంగా రాష్ట్రం ఏపీ. కానీ ఏపీలోనే భారతీయ జనతా పార్టీ రింగ్ మాస్టర్ గా మారింది. అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాయి. ఎవరూ బీజేపీని వ్యతిరేకించడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీజేపీతో కలిసి అధికారిక మిత్రపక్షంగా మారాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ కూటమిలో చేరకపోయినా టీడీపీ కంటే నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటామని సంకేతాలు పంపుతోంది. జనసేన కూటమిలోనే ఉన్నామంటోంది.

బీజేపీతో పొత్తులపై టీడీపీ ఇప్పటి వరకూ బహిరంగంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్డీఏలో చేరే అంశంపైనా స్పందించలేదు. గతంలో ఓ సారి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం వివరాలు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి ఢిల్లీ వెళ్లి వారిద్దరితో సమావేశం అయ్యారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చల వివరాలు బయటకు రాలేదు. కేంద్రంలో వచ్చే సారి కూడా బీజేపీ గెలవడం ఖాయమని అంచనా వేస్తున్న సమయంలో బీజేపీ మద్దతు అవసరమని భావించి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. పవన్ కూడా వెళ్లనున్నారు. అయితే చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత.. ఎం జరిగిందో బయటకు రాక ముందే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ ఖరారైందని ఆయనకు సమాచారం వచ్చింది. అయితే అమిత్ షాతోనూ కలుస్తారు. జగన్ అజెండా రాజకీయమేనని చెప్పాల్లిన పని లేదు. లోపల ఏం చర్చిస్తారు.. టీడీపీ, బీజేపీ కలవకుండా చేయగలుగుతారా అన్నది తర్వాత విషయం. కానీ రాజకీయం మొత్తం బీజేపీ తమ చుట్టూనే తిప్పుకుంటోందని స్పష్టమవుతోంది. ఏపీలో ఇరవై ఐదు లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచినా ఆ సీట్లన్నీ బీజేపీకే మద్దతుగా ఉంటాయి. అందుకే బీజేపీ కూడా అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close