కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవకులను గుర్తించింది. ముఖ్యంగా కమ్యూనిస్టు దిగ్గజం, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్‌ను దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ తో గౌరవించడం చర్చనీయాంశమైంది. బీజేపీ ప్రభుత్వ సిద్ధాంతాలకు, అచ్యుతానందన్ ప్రాతినిధ్యం వహించే వామపక్ష భావజాలానికి మధ్య తీవ్ర వైరుధ్యం ఉన్నప్పటికీ, ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని , ప్రజా పోరాటాలను గుర్తించి ఈ గౌరవాన్ని ప్రకటించాక.ు
ఇదే కోవలో జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి షిబూ సోరెన్‌కు పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, సమాజంపై ప్రభావం చూపిన నేతల సేవలను పరిగణనలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. భావజాల విభేదాలు ఉన్నప్పటికీ, విపక్ష నేతలకు వారి స్థాయికి తగిన గుర్తింపు ఇవ్వడం ద్వారా కేంద్రం ఒక సానుకూల సంకేతాన్ని పంపింది.
గతంలో కూడా మోదీ ప్రభుత్వం ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులను పద్మ పురస్కారాలతో సత్కరించిన దాఖలాలు ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి వారికి గతంలోనే అత్యున్నత గౌరవాలు దక్కాయి. తాజా పురస్కారాల ఎంపికలోనూ ప్రాంతీయ సమతుల్యతతో పాటు, రాజకీయాలకు అతీతంగా అర్హతకే పెద్దపీట వేశారని అనుకోవచ్చు.
