ఈసీ విఫలం అయిందని కన్నా సర్టిఫికెట్..! తేడాగా లేదూ..?

ఎన్నికల సంఘం పనితీరును అడ్డగోలుగా సమర్థించేవారిలో ముందుగా… భారతీయ జనతా పార్టీ నేతలు ఉంటారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉంటారు. బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంలతో ఎన్నికలు జరగాలని పట్టుబట్టారు. ఎన్నికల సంఘం గుప్పిట్లో ఉంది కాబట్టి.. కావాల్సినట్లుగా.. వ్యవహారాలు నడిపారు. ఏపీలో వారి టార్గెట్ చంద్రబాబును ఓడించడమే కాబట్టి.. వైసీపీకి సహకారం అందించారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. నిన్నటి వరకూ.. ఈసీని పొగిడిన చోట పొగడకుండా పొగిడారు. వైసీపీ నేతలు అయితే లేఖల మీద లేఖలు రాసి.. ఈసీ శభాష్ అనేశారు.

అయితే ఇప్పుడు మాత్రం.. మెల్లగా టోన్ మార్చుతున్నారు. ఎన్నికల సంఘంపై విమర్శలు ప్రారంభించారు. ఈవీఎంలపై చంద్రబాబు పోరాటాన్ని అనుమానించాల్సి వస్తోందంటూ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పిన కారణం ఏమిటంటే… చంద్రబాబు.. అభ్యర్థులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్లను పొగిడారట. కలెక్టర్లను పొగడటానికి .. చంద్రబాబు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడానికి చాలా లింకులు ఉన్నాయి. ఎందుకంటే.. కలెక్టర్లను .. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే నియమించారు. కానీ.. వారంతా.. ఈసీ అధీనంలో పని చేస్తారు. అందుకే కన్నాకు అనుమానం వచ్చింది.

అయితే.. కలెక్టర్లు అందరూ.. ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ… సమీక్షా సమావేశాల్లో పలువురు నేతలు… చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయినా కన్నాకు మాత్రం పొగిడినట్లు అనిపించింది. అందుకే కన్నా లక్ష్మినారాయణ… రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలం అయిందని తేల్చేశారు. ఇలాంటి ఎన్నికలు ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదని తేల్చేశారు. టీడీపీ నేతలు కూడా… ఎన్నికలు జరిగిన మరుక్షణం నుంచి అదే చెబుతున్నారు. ఏపీలో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు. మొత్తానికి అసలు విషయం తేడాగా ఉందనే ఫీడ్ బ్యాక్ వస్తూండే సరికి.. బీజేపీ నేతలు కూడా.. ఈసీపైనా.. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close