బీజేపీ మత అసహనాన్ని సజీవంగా ఉంచాలనుకొంటోందా?

ముందుగా ఒక చిన్న కధ చెప్పుకొన్న తరువాత అసలు విషయంలోకి వెళదాము. ఒక యోగీశ్వరుడు తన శిష్యులతో కలిసి చిన్న నదిని దాటుతుంటే ఒక అందమయిన అమ్మాయి వచ్చి “స్వామీ..నన్ను కూడా ఈ నదిని దాటించండి” అని అడుగుతుంది. అందుకు ఆయన అంగీకరించి ఆమెను తన వీపు మీద మోసుకొని నదిని దాటిస్తాడు. ఆ తరువాత ఆమె తన దారిన తను వెళ్ళిపోతుంది. యోగీశ్వరుడు తన శిష్యులతో కలిసి ముందుకు సాగిపోతాడు. కొన్ని రోజుల తరువాత ఆయన శిష్యులలో ఒకడు “స్వామీ..నాకో సందేహం..సర్వసంగ పరిత్యాగులయిన మీరు, వయసులో ఉన్న ఒక అందమయిన అమ్మాయిని వీపు మీద మోసుకొని వస్తునప్పుడు మీకేమీ అనిపించలేదా? అది తమకు తగునా?” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విని యోగీశ్వరుడు నవ్వుతూ “నాయినా… నేను ఆ అమ్మాయిని అక్కడే దించేశాను..కానీ నువ్వేమిటి.. ఆమె గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా?” అని ప్రశ్నించేసరికి, తన ఆలోచన ఇంకా ఆ నది దగ్గరే..ఆ అందమయిన అమ్మాయి చుట్టూనే తిరుగుతోందని గ్రహించి శిష్యుడు సిగ్గుపడతాడు.

ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేక దేశంలో మత అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేసిన ప్రచారం దెబ్బకి బీజేపీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా దెబ్బయిపోయిన సంగతి అందరూ చూసారు. అనుకొన్న లక్ష్యం నెరవేరడంతో ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఊహాజనితమయిన ఆ మత అసహనం గురించి మాట్లాడటం మానేసింది. మేధావులు తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇవ్వడం మానేశారు. అంటే దేశంలో మత అసహనం తగ్గిపోయిందనుకోవాలన్న మాట!

కాంగ్రెస్ పార్టీ దానిని బిహార్ ఎన్నికలతోనే విడిచిపెట్టేసినా బీజేపీ నేతలు మాత్రం యోగీశ్వరుడి శిష్యుడిలా దానినే పట్టుకొని ఇంకా వ్రేలాడుతూనే ఉండటం విశేషం. మత అసహనం గురించి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాట్లాడిన మాటల గురించి బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా అలాగే చూడాల్సి ఉంటుంది. అలాగే మరో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా మీడియాతో మాట్లాడుతూ “ఇంతకు ముందు షారూక్ ఖాన్ కి బుద్ది చెప్పాము..అలాగే ఇప్పుడు అమీర్ ఖాన్ కి కూడా బుద్ధి చెప్పవలసిన సమయం వచ్చింది.. షారూక్ ఖాన్ నటించిన దిల్ వాలే సినిమాకు ఆటంకం కలిగించినట్లే, త్వరలో విడుదల కానున్న అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’ కి ఆటంకాలు కలిగించాలి” అని అర్ధం వచ్చే విధంగా మాట్లాడటం చాలా విస్మయం కలిగిస్తుంది.

ఒకప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మత సహనం గురించి గట్టిగా మాట్లాడుతునప్పుడు, దానిని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక బీజేపీ నేతలు తలలు పట్టుకొన్నారు. చివరికి బిహార్ ని కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు ఆ బీజేపీ నేతలే ఇటువంటి మాటలు మాట్లాడుతూ దేశంలో మత అసహనం సజీవంగా ఉందని చాటి చెపుతున్నారు. బహుశః అది కొరివితో తల గోక్కోవడంగానే భావించవచ్చును.

ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచేరి అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీహార్ ఎన్నికలలో తమను చావు దెబ్బ తీసిన ఆ మత అసహనంతోనే ఆ రాష్ట్రాలలో గెలవాలని బీజేపీ బావిస్తోందేమో తెలియదు కానీ బీజేపీ నేతల మాటలు వింటుంటే ఆ పార్టీ తనపై ఉన్న మతతత్వ ముద్రను ఎన్నటికీ వదిలించుకోదనే విషయం స్పష్టం అవుతోంది. అది ప్రయోగించాలనుకొంటున్న ‘మతం కార్డు’ ఉత్తరాదిన ఏదో ఒక రాష్ట్రంలో పని చేయవచ్చునేమో కానీ పశ్చిమ బెంగాల్, దక్షిణాది రాష్ట్రాలలో పనిచేస్తుందనుకొంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండబోదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close