శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదని ప్రచారం ప్రారంభించారు. అలా దర్శించుకోకపోగా…ఆయన చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసి… నామినేషన్ వేశారని.. ఫోటోలు బయట పెట్టారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టి అవే ఆరోపణలు చేశారు. గురుమూర్తి మీద బీజేపీ మొదటి నుంచి ఇవే ఆరోపణలు చేస్తోంది. ఆయన క్రిస్టియన్ అని.. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరి నుంచి పోటీ చేయడానికి అనర్హుడని అంటోంది. మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు వర్తించవని.. బీజేపీ నేతలు అంటున్నారు.

నిజంగా గురుమూర్తి మతం మార్చుకుంటే… ఆయనను అనుర్హుడ్ని చేయడానికి బీజేపీకి ఎంతో సేపు పట్టదు. కానీ.. ఆయన మతం మార్చుకున్నారని నిరూపించడానికి బదులు.. ఆయన క్రిస్టియన్ అని ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. గురుమూర్తి క్రిస్టియనేనన్న విషయం … వైసీపీ నేతలందరికీ తెలుసు. తిరుపతిలో ఆయన అభ్యర్థిత్వాన్ని జగన్ ప్రకటించినప్పుడు.. కొంత మంది గుసగుసలాడుకున్నారు. ఎవరితోనూ చర్చించకుండా జగన్ నిర్ణయాన్ని ప్రకటించడంతో ఎవరూ తమ అభిప్రాయాన్ని చెప్పే సాహసం కూడా చేయలేదు. జగన్ నిర్దేశించినట్లుగా గురుమూర్తి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.

అయితే శ్రీవారిని దర్శించుకోకపోయినంత మాత్రాన.. తిరుపతిలో పోటీ చేయకూడదా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. టెంపుల్ సిటీ అయిన తిరుపతి కేంద్రంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓ క్రిస్టియన్ ఎంపీగా వెళ్తే అది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ కోణంలోనే ఓట్ల వేట సాగిస్తున్నారు. కొసమెరుపేమిటంటే… బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ పై కూడా… క్రిస్టియన్ అనే ప్రచారం ఉంది. ఆమె భర్త కుటుంబం క్రిస్టియానిటీని ఆచరిస్తారు. ఈ విషయంపై ఫోటోలతో సహా ప్రచారం అవుతోంది. కానీ.. బీజేపీ వాటిని పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close