మూగజీవిపై ప్రతాపం చూపిన భాజపా ఎమ్మెల్యే అరెస్ట్!

అదొక మూగజీవి. పైగా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సేవ చేస్తోంది. దానిపై భాజపా ఎమ్మెల్యే గణేష్ జోషి తన ప్రతాపం చూపడంతో దాని కుడి కాలు తీసివేయవలసి వచ్చింది. ఆ మూగజీవి పేరు శక్తిమాన్. అది ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన గుర్రం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ నిధులు దుర్వినియోగం చేసారని ఆరోపిస్తూ స్థానిక భాజపా నేతలు, కార్యకర్తలు సోమవారంనాడు డెహ్రాడూన్ లో ఒక నిరసన ర్యాలీ నిర్వహించారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు గుర్రాలపై వచ్చినపుడు వారిలో భాజపా ఎమ్మెల్యే గణేష్ జోషి తన చేతిలో ఉన్న పెద్ద కర్రతో శక్తిమాన్ అనే గుర్రంపై దాడి చేసాడు. అతను కొట్టిన దెబ్బలకి ఆ గుర్రం తీవ్రంగా గాయపడింది. దాని ముందరి కాళ్ళలో కుడికాలు ఎముకలు మోకాలు వరకు నుజ్జునుజ్జయిపోయాయి. దానికి వైద్యం చేయడానికి ఏకంగా పది మంది వైద్యులు అవసరం పడ్డారంటే అది ఎంత తీవ్రంగా గాయపడిందో అర్ధం చేసుకోవచ్చును. తప్పనిసరి పరిస్థితిలో దాని మోకాలు వరకు కాలిని తీసివేయవలసి వచ్చింది. ఆపరేషన్ చేసి దాని కాలు తొలగించిన తరువాత మళ్ళీ దాని స్థానంలో ఒక కృత్రిమ కాలుని వైద్యులు అమర్చారు. నోరులేని ఆ మూగజీవిని అంత దారుణంగా గాయపరిచిన గణేష్ జోషిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేనకా గాంధీ ప్రధాని నరేంద్ర మోడిని కోరారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసారు. అయితే ఆ సమయంలో తన చేతిలో కర్ర ఉన్న మాట వాస్తవమే కానీ తను గుర్రం మీద దాడి చేయలేదని, ఒకవేళ దాడి చేసినట్లు రుజువుచేస్తే ఏ శిక్షకయినా తాను సిద్దం అని గణేష్ జోషి వాదిస్తున్నారు. మరి అతను చేయకపోతే ఆ గుర్రానికి కాలు ఎలాగ విరిగింది? ర్యాలీలో పాల్గొంటున్న అతని చేతిలో కర్ర ఎందుకుంది? ఒకవేళ తను దాడి చేయకపోతే మరి దానిపై ఎవరు దాడి చేసారో ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటీటీకి ఓదార్పు విజ‌యాలు

థియేట‌ర్‌కి ఓటీటీ వేదిక ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌ని భావిస్తున్న త‌రుణంలో వ‌రుస ప‌రాజ‌యాలు ఓటీటీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. థియేట‌ర్లు మూత‌బ‌డిన త‌ర‌వాత నిర్మాత‌ల చూపుల‌న్నీ ఓటీటీపై ప‌డ్డాయి. హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ...

క‌రోనాతో నిర్మాత సోద‌రుడి మృతి

క‌రోనా ప‌డ‌గ చిత్ర‌సీమ‌పై ప‌డింది. ప్ర‌ముఖ నిర్మాత పోకూరి బాబూరావు సోద‌రు.. పోకూరి రామారావు క‌రోనా తో మృతి చెందారు. శుక్ర‌వారం రాత్రి ఆయ‌న క‌న్ను మూశారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న...

విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ “సమైక్య” పోరాటం..!

తెలంగాణ సీఎం కేసీఆర్... కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కొత్త ప్రణాళిక రచిస్తున్నారు. దానికి ప్రాతిపదిక.. కొత్త విద్యుత్ చట్టం. రాష్ట్రాల అధీనంలో ఉన్న విద్యుత్ వ్యవస్థలన్నిటినీ గుప్పిట పట్టేందుకు కేంద్రం కొత్త విద్యుత్...

లొంగిపోయిన మీడియానే తెలంగాణ ప్రజలకు శాపం..!

ప్రజాస్వామ్యంలో మీడియానే నిఖార్సయిన ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం కూడా పాలకులకు లొంగిపోతే జరిగేది ప్రజలకు నష్టమే. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకునే పత్రికలు..మీడియా ప్రభుత్వాలకు లొంగి పోవడం వల్ల......

HOT NEWS

[X] Close
[X] Close