జగన్ పరిపాలనలో జరిగిన వ్యవహారాలపై అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. చిరంజీవితో పాటుఇతర హీరోలను అవమానించినట్లుగా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. అలాగే రఘురామకృష్ణరాజును విమర్శించిన వ్యవహారంలోనూ ఆయన పోలికలు వివాదాస్పదమయ్యాయి. అదే సమయంలో ఆయన ప్రసంగం వల్ల బాలకృష్ణ జోక్యం చేసుకోవడంతో మరింత వివాదం రేగింది. చివరికి తన వల్లే ఇబ్బంది అయితే తన మాటల్ని తొలగించాలని కామినేని స్పీకర్ను కోరారు.
కామినేని జగన్ హయాంలో జరిగిన అరాచకాల్ని వివరించాలనుకున్నారు. కానీ ఆ సందర్భంలో ఆయన సినీ హీరోలను తక్కువ చేసినట్లుగా మాట్లాడారు. చెప్పాల్సిన పద్దతిలో చెప్పలేదు. అదే సమయంలో ఆయన మాటల్ని బాలకృష్ణ మరో రకంగా అర్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో తనకు గౌరవాన్ని తగ్గించిన విషయం గుర్తుకు వచ్చిన బాలకృష్ణ దీంతో గట్టిగా మాట్లాడారు. అది పెద్ద విషయం అయిపోయింది.
ఇప్పుడు కామినేని శ్రీనివాస్ తన మాటల్ని వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. స్పీకర్ వాటిని రికార్డుల నుంచి తొలగించవచ్చు. కానీ ఆయన ప్రసంగం వల్ల ఏర్పడిన రాజకీయ దుమారం మాత్రం.. మళ్లీ సెటిల్ కావడానికి కొంత టైం పడుతుంది.