బెంగాల్‌లో బీజేపీ ఉచిత హామీల వరద..! నమ్ముతారా..?

బెంగాల్ ప్రజలను ఆకట్టుకుని ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రుణమాఫీ కూడా ఉంది. రైతులకు రూ. పద్దెనిమిది వేల చొప్పున రుణమాఫీ చేస్తామని అందులో హామీ ఇచ్చారు. అదే కాదు.. ఇంటికో ఉద్యోగం అని ఆచరణ సాధ్యం కాని హామీ కూడా ఇచ్చారు. ఈ మేనిఫెస్టోను హోంమంత్రి అమిత్ షా స్వయంగా విడుదల చేశారు. అందులో ఉన్న హామీలను చూసి… బెంగాలీలు ఆశ్చర్యపోతున్నారో లేదో కానీ.. చాలా మందికి గతంలో బీజేపీ ఇచ్చిన బెంచ్ మార్క్ హామీలు గుర్తుకు వస్తున్నాయి. నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని .. మొదటి సారి ఎన్నికల్లో గెలవక ముందు మోడీహామీ ఇచ్చేవారు. అన్నిప్రచార సభల్లో చెప్పేవారు.

చివరికి నల్లధనం వెనక్కి తేలేదు… ఎవరికీ పైసా ఇవ్వలేదు. ఎన్నో చెబుతూంటాం కానీ అన్నీ చేస్తామా అని ఓ సందర్భంలో అమిత్ షా .. ఈ హామీ గురించి వ్యాఖ్యానించారు. అదే్ సమయంలో… ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని.. కూడా హామీ ఇచ్చారు. ఇచ్చారో లేదో కానీ.. నోట్ల రద్దు, లాక్ డౌన్ వల్ల ఆరేంజ్ లో ఉద్యోగాలు పోయాయని మాత్రం చెప్పుకున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి అప్పట్లో చేసిన ప్రచారాలు.. ఇప్పుడుచేస్తున్న పనులు అన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ భారతీయజనతా పార్టీ బెంగాల్‌లో ఏమాత్రం మొహమాట పడకుండా పెద్ద ఎత్తున ఉచిత హామీలు గుప్పించింది. అమలు చేస్తారా లేదా అన్నది తర్వాతి సంగతి… లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసినట్లేగా వేస్తే చాలన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రచార వ్యూహంలోనూ బీజేపీ తడబడుతోంది.

సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తోంది. ఇక టీవీ ప్రచార కార్యక్రమాలు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగాల్ ప్రజల అమాయకత్వాన్ని ఓట్లుగా మార్చుకోవడానికి అసాధ్యమైన విషయాలను మోడీ మాత్రమే చేయగలరంటూ ప్రచారం చేసుకోవండ.. ప్రజల్ని విస్తుపరిచేలా చేస్తోంది. అయినా బీజేపీ మాత్రం తన దారిలోనే తాను వెళ్తోంది. బెంగాల్ ప్రజలు బీజేపీ ..మేనిఫెస్టో చేతికి చిక్కుతారా..లేదా అనేది చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులు కొట్టారని RRR ఫిర్యాదు, పోలీసుల పై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంటే, అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని జగన్ రెడ్డి సర్కార్ అరెస్టు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్షాలు మొదలుకొని సామాజిక వర్గ...

ఆహా కోసం రెండు క‌థ‌లు సిద్ధం చేసిన మారుతి

మెగా కుటుంబంతో మారుతికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. అల్లు శిరీష్ తో త‌ప్ప‌.. మెగా హీరోలెవ‌రితోనూ సినిమాలు చేయ‌క‌పోయినా మంచి రాపో ఏర్ప‌డింది. అల్లు అర్జున్ కి మారుతి చాలా క్లోజ్‌. అల్లు...

టెన్త్ పరీక్షలు నిర్వహిస్తాం : ఏపీ సర్కార్

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లోకేష్ రాసిన లేఖపై ఏపీ విద్యా మంత్రి సురేష్ పరోక్షంగా స్పందించారు. పరీక్షలు జరిగితీరుతాయని విద్యార్థులు ప్రిపేర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. షెడ్యూల్...

పవన్ సరే ఆ బాధ్యత అధికార పార్టీకి లేదా..!?

రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది కరెక్ట్ సమయం కాదని .. ముందు కోవిడ్ రోగుల గురించి పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. పవన్ కల్యాణ్ లేఖపై వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close