బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ల రద్దు పై ప్రజల్లో జరిగిన చర్చ ఆ పార్టీని సమస్యల్లోకి నెట్టింది. చచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రజల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది. నాలుగు విడతలు అలా గడిచిన తర్వాత బీజేపీకి ప్రజల్ని భావోద్వేగాల్లో ముంచే అస్త్రం దొరికింది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్.
పాక్ ఆక్రమిత కఅక్కడ కొన్నేళ్లుగా నిత్యం ఆందోళనలు, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరత పై జమ్ముకశ్మీర్ జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఆందోళనలు చేపట్టింది. పీవోకే హింసతో దద్దరిల్లింది. పీవోకే నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును మిగతా పాకిస్థాన్ వాడుకుంటోంది. కానీ పీవోకేకు కరెంట్ లేదు. కనీసం గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ వివక్షను నిరసిస్తూ తిరుగుబాటు మొదలైంది. స్వాతంత్య్రం కావాలంటూ రోడ్లపైకి వస్తున్నారు. పీవోకేను భారత్ లో కలుపాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి.
ఇక పీవోకేను రాజకీయ అంశంగా మార్చుకున్న బీజేపీ ఊరుకుంటుందా ?. రంగంలోకి దిగిపోయింది. మూడో విడతకు ముందు నుంచే… పీవోకే పై ప్రకటనలు ప్రారంభఇంచారు. హోం మంత్రి అమిత్ షా తెలంగాణలోని నాగర్ కర్నూల్ సభలోనూ ఇదే అంశం లేవనెత్తారు. పీవోకే భారత్ కే చెందుతుందని తెలిపారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందేనని ప్రకటించారు. ఇప్పుడు ప్రతి సభలోనూ పీవోకేను హైలెట్ చేస్తున్నారు.
గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలో పీవోకేను ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా గొప్పగా చెప్పారు. మూడో సారి గెలిస్తే అదే జరుగుతుందని ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. బీజేపీకి ఇది అనుకూలమైన పరిణామమే. ఇలాంటి వాటిని సమర్థంగా వాడుకోవడంలో ఆ పార్టీకి సాటి ఉండదు.