తిరుపతి నుంచి పోటీ చేసేది బీజేపీనే..!

తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ -జనసేన కూటమి తరపున భారతీయ జనతా పార్టీ అభ్యర్థే రంగంలో ఉంటారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కూడా అయిన మురళీధరన్ ప్రస్తుతం కేరళ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సమయంలో తీరిక చేసుకుని.. తిరుపతి అభ్యర్థి గురించి ప్రకటన చేశారంటే.. జనసేన కూడా అంగీకరించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు జనసేన, ఏపీ బీజేపీ అగ్రనేతలందరూ కలిసి జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా మురళీధరన్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ కోసం పోటీ నుంచి వైదొలిగిన జనసేన.. తిరుపతిలోనూ అదే దారి పట్టడంతో జనసైనికులు నిరాశకు గురవుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ కన్నా.. జనసేన ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలను పొందింది. అయినప్పటికీ.. జనసేన సీటును బీజేపీకి త్యాగం చేసింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఉపఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుందని అనుకున్నారు కానీ.. బీజేపీ కసరత్తులు పూర్తి కాలేదని అనుకున్నారో ఏమో కానీ.. విడిగా ప్రకటిస్తామని.. ఈసీ ప్రకటించింది. మొత్తంగా ఎనిమిది విడతల పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో ఏదో ఓ దశలో… తిరుపతి , నాగార్జునసాగర్ ఉపఎన్నికల పోలింగ్ కూడా జరుగుతుంది. ఆ ప్రకారం షెడ్యూల్ విడుదలవుతుంది. తిరుపతిలో వైసీపీ ఎంపీ కరోనా కారణంగా చనిపోవడంతో ఉపఎన్నికలు వచ్చాయి. తాము పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్సాహపడ్డారు. చివరికి… వెనక్కి తగ్గినట్లుగా ఉన్నారు. ఇటీవల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

స్టీల్ ప్లాంట్ ఉద్యమంతో పాటు అనేక అంశాలు.. బీజేపీ-జనసేన కూటమికి ఇబ్బందికరంగా మారాయి. అక్కడ జనసేన పోటీ చేస్తేనే… ఓ వర్గం మద్దతు ఇస్తామని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. చివరికి బీజేపీనే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీకి ఏడు నియోజకవర్గాల్లో కలిపి ఇరవై వేల ఓట్లు కూడా రాలేదు. ఈ సారి మాత్రం.. గెలిచి చూపిస్తామని.. బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“దిశ” బిల్లు ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉందట..!

దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.....

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

HOT NEWS

[X] Close
[X] Close