తెలంగాణలో టీడీపీతో పెట్టుకుంటే బీజేపీకి మైనస్సే !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోదీతో రెండు నిమిషాలు నిలబడి మాట్లాడగానే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం మారిపోయింది. తెలంగాణలో బీజేపీకి టీడీపీ సహకరించేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ ఓ ప్రధాన పోటీదారుగా ఉంది. టీడీపీ అసలు లేదు. దాదాపుగా అంతర్ధానం అయిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ మేజర్ భాగస్వామిగా ఉండి బీజేపీతో పొత్తులు పెట్టుకుంది. టీడీపీకి పధ్నాలుగు అసెంబ్లీ సీట్లు.. బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు టీడీపీకి అభ్యర్థులు లేని పరిస్థితి.

ఇలాంటి పరిస్థితిలో టీడీపీ సహకారాన్ని బీజేపీ కోరుతుందా అనేది ముఖ్య సందేహం. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు వల్ల ప్లస్‌తో పాటుమైనస్ కూడా ఉంటుంది. చంద్రబాబు బీజేపీ రూపంలో మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని టీఆర్ఎస్ అధినేత ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆ సెంటిమంట్ వర్కవుట్ అయితే బీజేపీకి చంద్రబాబు.. టీడీపీ వల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. గత ఎన్నికల్లో ఇది స్పష్టయింది. బీజేపీ నేతలకకూ టీడీపీ సపోర్ట్ ఇష్టముంటుందని అనుకునే పరిస్థితి లేదు.

అయితే చంద్రబాబు అసలు తెలంగాణలో పోటీచేయకుడా తెర వెనుక బీజేపీకి మద్దతిస్తే మాత్రం కొంత వరకూ ఆ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది. కానీ ఇది సాధ్యమేనా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి మద్దతుగా ఉంటారు కాబట్టి.. ఏపీలో తమ పార్టీ బాగుకోసం అయినా కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీకి మద్దతిచ్చే ఆలోచన చందర్బాబు చేయవచ్చని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close