ఎన్టీఆర్ టు చిరంజీవి – ఏపీ బీజేపీ ప్రయత్నాలన్నీ ఫెయిలేనా ?

ఏపీలో అయితే ఎన్టీఆర్ లేకపోతే చిరంజీవిని ఆకర్షించేద్దామని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం లేదు. రాజకీయాలపై ఆసక్తితో గతంలో పార్టీ పెట్టి తప్పిదాలు చేసిన.. కనుమరుగైపోయిన చిరంజీవికి మళ్లీ లైఫ్ ఇస్తామన్న సంకేతాలను బీజేపీ చాలా కాలంగా పంపుతోంది. తాజాగా ఆయనకు అప్రకటిత వీఐపీ స్టేటస్ ప్రకటించి.. తమ వాడికి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చిరంజీవి ఏ మాత్రం మొగ్గు చూపినా.. బీజేపీ అగ్రనాయకత్వ అందుకుంటుంది. కానీ చిరంజీవికి చాలా పరిమితులు ఉన్నాయి. అందులో మొదటిది జనసేన పార్టీ. తమ్ముడికి ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అందుకే వేరే పార్టీలో చేరడం అసాధ్యమన్న సంకేతాలు పంపించారు.

చిరంజీవి కంటే ముందే బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ పై దృష్టి పెట్టింది. కొన్నాళ్ల క్రితం అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించి మాట్లాడారు. ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు.కానీ సహజంగానే రాజకీయాలపై చర్చ వస్తుంది. అలా భేటీ ముగిసిన తర్వాత నుంచి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ తమకు ప్రచారం చేస్తారని ప్రకటించారు. సోము వీర్రాజు లాంటి నేతలు .. జూనియర్ ఎన్టీఆర్ తమకు స్టార్ క్యాంపెయినర్ అని ప్రకటించేసుకున్నారు. కానీ అమిత్ షా లాంటి పెద్ద మనిషి పిలిచినప్పుడు వెళ్లి కలవడం గౌరవం.. ఆ మేరకు వెళ్లాను..అంతకు మించి ఏం లేదన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ నింపాదిగా తన పని తాను చేసుకుంటున్నారు.

రాష్ట్రాల్లో బీజేపీ ఎదగాలంటే… ఇలాంటి సూపర్ స్టార్లను క్యాచ్ చేయాలని బీజేపీ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆకర్షించింది తక్కువ. తమిళనాడులో రజనీకాంత్ ని కూడా ఒప్పించలేకపోయారు. ఏపీలో మరో ప్రయత్నం చేస్తున్నారు. కానీ బిజేపీ ఎంచుకున్న ఇద్దరు స్టార్లకు వారు ముందడుగువేయలేనంత రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే బీజేపీతో పొత్తులో ఓ సూపర్ స్టార్ ఉన్నారు. ఆయనేపవన్ కల్యాణ్, తాను సొంతంగా ఎదుగుతా అంటున్నారు కానీ.. పార్టీని విలీనం చేయడానికి అంగీకిరంచడం లేదు. అందుకే బీజేపీ పవన్‌ను పరిగణనలోకి తీసుకోలేకపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌మున బ‌యోపిక్‌లో త‌మ‌న్నా?

ఓ అగ్ర తార చ‌నిపోయిన మ‌రుక్ష‌ణం.. బ‌యోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న వ‌స్తుందేమో..? ఈమ‌ధ్య అలానే జ‌రిగింది. ఇప్పుడు జమున విష‌యంలోనూ ఇలానే ఆలోచిస్తోంది చిత్ర‌సీమ‌. దాదాపు 200...

బాల‌య్య సినిమా చూసిన బ‌న్నీ

అల్లు కుటుంబానికీ బాల‌య్య‌కూ అనుబంధం ఈమ‌ధ్య బాగా బ‌ల‌ప‌డింది. ఆహాలో.. అన్ స్టాప‌బుల్ కి బాల‌య్య హౌస్ట్ గా రావ‌డం ద‌గ్గ‌ర్నుంచి ఈ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వ‌డం మొద‌లైంది. అఖండ ప్రీ రిలీజ్‌కి...

‘ఖుషి’…. మ‌ళ్లీ మొద‌లు

స‌మంత అనారోగ్యంతో... `ఖుషి` సినిమాకి బ్రేకులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ఇది. డిసెంబ‌రులో విడుదల కావాల్సింది. అయితే.. స‌మంత అనారోగ్యంతో షూటింగ్...

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా... మూడు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close