చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయాల్సిందేనా..?

ఢిల్లీలో కొంత కాలం నుంచి చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఓ ఆపరేషన్ నడుస్తోంది. ఆ ఆపరేషన్ లక్ష్యం చంద్రబాబును ఏదో విధంగా కేసుల్లో ఇరికించడం. అవినీతి మరకలు అంటించడం. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. నిన్న ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం కావడం … చంద్రబాబు ప్రభుత్వం అవినితీకి ఆధారాలున్నాయని కొన్ని పత్రాలను అందించినట్లు ప్రచారం జరుగుతూండటంతో ఇది నిజమేనన్న భావన ప్రజల్లోకి వెళ్తోంది. అదే సమయంలో ప్రధానమంత్రి కార్యాలయంలోని కొంత మంది ఉన్నతాధికారులతో… కన్నా, జీవీఎల్, రామ్‌మాధవ్, పురందేశ్వరి లాంటి వారు రోజంతా చర్చల్లో మునిగి తేలారు. అదే సమయంలో బుగ్గన కూడా వెళ్లారు. అందరి అజెండా చంద్రబాబుపై కేసులేనన్న ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్నీ గతంలో ఢిల్లీకి పిలిపించి… చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని..ఇప్పటికే ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్టేట్‌మెంట్ ప్రకారం చంద్రబాబుపై కేసులు పెడతారని కూడా భావించారు. అయితే ఎలాంటి ఫిర్యాదులు లేకుండా… తమంతట తాముగా… కేసు నమోదు చేస్తే… రాజకీయ వేధింపులుగా భావిస్తారు. దీంతో ప్రజల సానుభూతి చంద్రబాబుకు వస్తుంది. అందుకే వ్యూహాత్మకంగా… “దమ్ముంటే మీరే విచారణకు ఆదేశించుకోవాలని” చంద్రబాబుకు సవాల్ చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి అటు భారతీయ జనతా పార్టీ నేతలు.. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్ అదే. సీబీఐ చేతిలో ఉన్న బీజేపీ చంద్రబాబును సొంతంగా విచారణకు ఆదేశించుకోవాలని డిమాండ్ చేస్తూండటం ఈ వ్యూహంలో భాగమే.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ప్రభుత్వ అవినీతి అంటూ ఓ రిపోర్టును ఇచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి పీఏసీలో ఏమైనా బయటపడితే అవి పాలనాపరమైన లోపాలే తప్ప… అవినీతి కాదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల… ఆడిట్ లోపాల వల్ల తేడాలు కనబడతాయి. అవన్నీ కాగ్ రిపోర్టులే. కాగ్ రిపోర్ట్ తర్వాత ఆయా అధికారులు వాటికి లెక్కలు చెబుతారు. పట్టిసీమ విషయంలో ఎక్కువ చెల్లించారంటున్న సొమ్ముకూ ఇలాగే లెక్కలు చెప్పారు కూడా. నిజానికి కాగ్ రిపోర్ట్ అనేది ఈ లోపాలను ఎత్తి చూపడానికే. కొద్ది రోజుల కిందట… కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన రూ. 85వేల కోట్ల విద్యాసెస్… ఎటు పోయిందో తెలియడం లేదని కాగ్ నివేదిక ఇచ్చింది. దీనిపై కేంద్రం ఇంత వరకూ స్పందించలేదు.

చంద్రబాబుపై ఇప్పుడు ఎలాంటి కేసులు పెట్టినా అది తెలుగుదేశంపార్టీకే ప్లస్ అవుతుంది. ఆ విషయం తెలిసి కూడా.. బీజేపీ పెద్దలు.. ఏదో విధంగా చంద్రబాబును కార్నర్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారని… ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. అవినీతి ముద్ర వేసి చంద్రబాబు, జగన్‌ దొందూ దొందే అనిపిస్తే … మిగతా పోల్ లెక్కలు బ్యాలెన్స్ చేయవచ్చన్న వ్యూహం ఢిల్లీ అమలు చేస్తోందని టీడీపీ నేతల అనుమానాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close