బీజేపీ రూ. 15 లక్షలు – టీఆర్ఎస్ రూ. 10 లక్షలు..! ఎవరు ముందిస్తారు..?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త రచ్చ ప్రారంభమైంది. దళిత బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఉద్యమం ప్రారంభించారు. బీజేపీ శ్రేణులు ఊరూరా వెళ్లి దరఖాస్తులు చేయించాలని ఆయన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రూ. పది లక్షలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. బండి సంజయ్ దరఖాస్తులు స్వీకరిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇస్తమన్న రూ. 15 లక్షల కోసం అని.. మంచి ప్రయత్నం చేస్తున్నారని.. త్వరగా అందరికీ ఇప్పించాలని ట్వీట్ చేశారు. దరఖాస్తు దారులందరూ ఆయన్నే ఆడగాలన్నారు.

2014 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నినాదం నల్లధనం వెనక్కితీసుకు వచ్చి రూ.15 లక్షలు ప్రతి ఒక్కరి అకౌంట్‌లో వేస్తామని చెప్పడం. అయితే ఆ తర్వాత నల్లధనం పేరు చెప్పి నోట్లనురద్దు చేశారు కానీ ఎలాంటి మనీ అకౌంట్లలో వేయలేదు. జన్‌ధన్ ఖాతాలు తెరిచిన వారందరూ ఎంతో ఆశగా చూశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. కానీ ఎన్నికల్లో ఎన్నో చెబుతాం.. అన్నీ ఇస్తామా ఏంటి అన్నట్లుగా బీజేపీ పెద్దలు ప్రకటనలు చేశారు. ఆ హామీని తర్వాతఎన్నికల్లో మర్చిపోయారు. కానీ విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉంటాయి.

తాజాగా కేసీఆర్ రూ. పది లక్షలు దళితులకు ఇస్తామని ప్రకటించడంతో… అలా ఇవ్వలేరని ఇచ్చినా.. అందరికీ ఇవ్వలేరన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించింది. దీనికి కౌంటర్‌గా కేటీఆర్ గతంలో ఇచ్చిన రూ. పదిహేను లక్షల హామీని తెరపైకి తీసుకు వచ్చారు. బండి సంజయ్ పోరాటం.. కేటీఆర్ కౌంటర్ మధ్య.. ముందు ఎవరు హామీని అమలు చేస్తారోనని నెటిజన్లు చర్చలు ప్రారంభించారు. రాజకీయ పార్టీలన్నీ ఇలా మభ్య పెడతాయని ఇవ్వవని మరికొంందరు కామెంట్లు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులకిచ్చిన “ఆఫర్” కూడా జగన్‌ మార్క్‌దే !

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన సీఎం జగ‌న్ అని దేశవ్యాప్తంగా గొప్పగా ప్రకటించారు. డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. జగన్...

సజ్జల పరిశీలించారు.. ఇప్పుడు సీఎం వంతు !

సొంతజిల్లాను వరదలు అతలాకుతలం చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. రెండు, మూడు తేదీల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరులోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించి...

కేసీఆర్ అగ్రెసివ్ పాలిటిక్స్ వెనుక ప్రశాంత్ కిషోర్ !?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రూటు మార్చారు. దారుణమైన తిట్లతో వివాదాస్పద రాజకీయం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. ఆయనకు ప్రశాంత్ కిషోర్ అందించడం ప్రారంభమైందని...

ఏపీ పేదల్లో “ఓటీఎస్” అలజడి ! ప్రభుత్వానికి దయ లేదా ?

ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఎక్కడకిక్కడ నిధులు సమీకరిస్తోంది. అప్పులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రజల్నీ బాదేయడం అనూహ్యంగా మారింది. నిరుపేదల్ని రూ....

HOT NEWS

[X] Close
[X] Close