విత్తన సమస్యను టీడీపీపై నెట్టేస్తే పరిష్కారమైనట్లేనా..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మొట్టమొదటి సమస్య వ్యవసాయరంగం నుంచే వచ్చింది. పాలన చేపట్టి నెల రోజులయింది. ఈ నెల రోజుల్లోనే రైతులందరూ.. రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఎదురయింది. సిక్కోలు నుంచి.. అనంతపురం వరకూ.. విత్తనాల సమస్య తీవ్రంగా ఉంది. పలు చోట్ల ధర్నాలు చేస్తున్నారు. విత్తన పంపిణీ కేంద్రాల వద్ద.. రైతులు బారులు తీరుతున్నారు. పడిగాపులు పడుతున్నారు. కానీ.. విత్తులు మాత్రం అందడం లేదు. కానీ.. విత్తన సమస్య తీర్చే చర్యల గురించి మాట్లాడాల్సిన మంత్రి… టీడీపీపై నిందలేసి.. తమ పని అయిందనిపించుకుంటున్నారు.

విత్తనాలు కావాలి మహాప్రభో.. అంటున్న రైతులు..!

విత్తనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ రైతాంగం నిరీక్షిస్తోంది. అసలే వర్షాలు ఆలస్యమయ్యాయి. అందుకే చినుకు పడినప్పుడే పంట వేసుకునేందుకు .. వేరుశెనగ, కంది, పత్తి,వరి విత్తనాల పంపిణీ కొంతవరకు జరిగింది. దీంతో మిగతా రైతులు విత్తనాల కోసం తిరుగుతూనే ఉన్నారు. వారం, పది రోజులుగా సబ్సిడీ విత్తనాల కోసం తిరుగుతున్నామని, ఇంకెప్పుడు విత్తుకు వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో తీవ్ర జాప్యం జరగిందంటూ… సీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర…రైతులు తహసీల్దార్‌ కార్యాలయాలను దిగ్బంధిస్తున్నారు. రోజంతా ధర్నాలు, రాస్తారోకోలతో కదం తొక్కుతున్నారు.

గత ప్రభుత్వానికి ప్రణాళిక లేదన్న ఏపీ మంత్రి..!

అయితే.. ప్రభుత్వం దగ్గర రైతుల సమస్యలను తీర్చడానికి ఉన్న ప్రణాళిక ఒక్కటిలాగే కనిపిస్తోంది. అదే టీడీపీ సర్కార్‌పై నెపం నెట్టేసి.. సైలెంటయిపోవడం. నెల రోజుల కిందట.. పాలన చేపట్టిన సర్కార్.. ఈ నెల రోజుల్లో… వ్యవసాయ సీజన్‌కు.. రైతులకు కావాల్సినవి అందుబాటులో ఉంచారో.. లేదో.. మాత్రం సమీక్ష చేయలేకపోయారు. అవినీతి పేరుతో.. సమీక్షలపై దృష్టి సారించిన సర్కార్… ఒక్క రోజుంటే.. ఒక్క రోజు కూడా వ్యవసాయ సమస్యలపై సమీక్షించలేదు. ఫలితంగా… విత్తన సంక్షోభం ముంచుకొచ్చింది. ఏం చేసైనా తక్షణం విత్తనాలు తెచ్చి.. రైతులకు ఇవ్వాల్సిన సర్కారు… గత ప్రభుత్వం దగ్గర ప్రణాళికే లేదని… విమర్శలు గుప్పించారు. నాణ్యమైన విత్తనాల పంపిణీలో గత ప్రభుత్వం విఫలమయిందని మంత్రి కన్నబాబు చెప్పుకొస్తున్నారు. విత్తన సేకరణకు, పంపిణీకి గత ప్రభుత్వానికి.. ఒక స్పష్టమైన కార్యాచరణ లేదని మండిపడ్డారు. విత్తనాల కోసం 10 రోజుల్లో మరో వెయ్యి కోట్లు విడుదల చేస్తామని గొప్పగా ప్రకటించారు. ఎక్కువ ధర ఇచ్చైనా నాణ్యమైన విత్తనాలు సేకరిస్తామని భారీ స్టేట్‌మెం‌ట్ ఇచ్చారు. ఇప్పుడు కావాల్సింది ప్రకటనలు.. కాదు కార్యాచరణ అని రైతులు అంటున్నారు.

ఐదేళ్లలో రాని సమస్య ఇప్పుడే ఎలా..?

నిజానికి రైతుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తడానికి కారణం… కూడా ఉంది. గత ఐదేళ్ల కాలంలో… వర్షాకాలం రాక ముందే.. వ్యవసాయ సీజన్లు ఆరంభం కాక ముందే.. పక్కా ప్రణాళికతో.. విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసేవారు. దాంతో… ఎక్కడా క్యూలు కనిపించేవి కావు. అవసరం అయినప్పుడు వచ్చి… తీసుకెళ్లాలా ఏర్పాట్లు ఉండేవి. కానీ ప్రభుత్వం మారగానే కష్టాలు వచ్చి పడ్డాయి. ఎన్నికల హడావుడిలో గత సర్కార్… దృష్టి పెట్టకపోవడం.. కొత్త సర్కార్ కూడా.. జరిగిదేదో జరుగుతుందని లైట్ తీసుకోవడంతో.. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందనను చూస్తూంటే.. విత్తనాల సమస్య ఇప్పుడల్లా తీరేలా లేదన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close