ప్ర‌ధాని మోడీ స‌మాధానం కోసం పెరుగుతున్న ఒత్తిడి..!

రాఫైల్ యుద్ధ విమ‌నాల కొనుగోలు ఒప్పందంపై పార్ల‌మెంటులో తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ర‌క్ష‌ణ‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స‌మాధానం చెప్పారు. అయితే, దేశ‌వ్యాప్తంగా ఇంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నా, సాక్షాత్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మీదే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నా… ఆయ‌న మాత్రం పార్ల‌మెంటుకు రావ‌డం లేదు. రాఫైల్ చ‌ర్చ‌పై ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న నోరు మెదిపిందీ లేదు. కానీ, ప‌రిస్థితి చూస్తుంటే ఆయ‌న స్పందించక త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంది. ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ నుంచి కాంగ్రెస్ లేవ‌నెత్తిన అనుమానాల‌కు స‌మాధానాలు వ‌చ్చినా కూడా… ఆరోప‌ణ‌లు ఉన్న‌వి ప్ర‌ధానిపై కాబ‌ట్టి, ఆయ‌న స్పందించాల‌న్న డిమాండ్ ఇప్పుడు పెరుగుతోంది.

మాజీ ప్ర‌ధాని దేవెగౌడ ఇదే అంశ‌మై ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… రాఫైల్ డీల్ మీద ప్ర‌ధాని పార్ల‌మెంటుకు వ‌చ్చి మాట్లాడాల‌న్నారు. ఆయ‌న గైర్హాజ‌రీ వ‌ల్ల దేశ ప్ర‌జ‌ల‌కు చాలా అనుమానాలు త‌లెత్తుతున్నాయ‌న్నారు. రాఫైల్ వివాదంపై ర‌క్ష‌ణ మంత్రి బాగానే వాదించార‌నీ, కానీ అది వేరే విష‌య‌మ‌న్నారు. ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న‌ది మోడీపై కాబ‌ట్టి, ఆయ‌న స‌భ‌కు రావాల‌ని దేవెగౌడ డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల‌కు అనుమానించే విధంగా మోడీ ప్ర‌వ‌ర్త‌న ఉంటోంద‌నీ, రాఫైల్ పై మౌనంగా ఉండ‌టం వెన‌క ఆయ‌న ఉద్దేశ‌మేంటో అని విమ‌ర్శించారు. త‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్పుడు, అవి క‌ల్పితాలే అని ప్ర‌భుత్వం న‌మ్ముతున్న‌ప్పుడు… వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్య‌త ప్ర‌ధానిపై ఉంటుంద‌నీ, ఆయ‌న స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డ‌మే ఇప్పుడు అస‌లు స‌మ‌స్య‌గా మారుతోంద‌ని దేవెగౌడ అభిప్రాయ‌ప‌డ్డారు.

నిన్న‌టి పార్ల‌మెంటు స‌మావేశంలో రాహుల్ గాంధీ కూడా ఇదే పాయింట్ మీద మాట్లాడారు. త‌న బాధ్య‌త‌ను ర‌క్ష‌ణ‌మంత్రి స‌మ‌ర్థంగా నిర్వ‌హించార‌ని అంటూనే… ప్ర‌ధాని మోడీ స‌మాధానం చెప్పాలంటూ ఆయ‌నా డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా రాఫైల్ గురించి చాలా సంద‌ర్భాల్లో మాట్లాడుతూ… దీనిపై ప్ర‌ధాని ఎందుకు స‌మాధానం చెప్ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇత‌ర రాష్ట్రాలు, ఇత‌ర పార్టీల నుంచి కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయ‌మే వ్య‌క్త‌మౌతోంది. ఈ డీల్ లో మోడీ పాత్ర ఏదీ లేక‌పోతే, ఆయ‌న అవినీతికి పాల్ప‌డ‌లేద‌న్న‌దే నిజ‌మైతే ఆ మాట ఆయ‌నే ఎందుకు చెప్ప‌డం లేద‌నే చ‌ర్చ ఇప్పుడు వినిపిస్తోంది. నిర్మ‌లా సీతారామ‌న్‌, అరుణ్ జైట్లీ, అమిత్ షా.. ఇలా ఎంత‌మంది రాఫైల్ ఒప్పందంపై వాద‌న‌కు దిగినా… మోడీ స్పందిస్తే త‌ప్ప ఉప‌యోగం లేద‌నే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి, దీనిపై మోడీ స్పంద‌న ఎలా ఉందో..? ఆయ‌న ఎప్పుడు స్పందిద్దామ‌నుకుంటున్నారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు....

ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో...

అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్...

“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close