ఏం మంత్రం వేశావ్ రౌడీ…?!

బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు ఎవ‌రైనా స‌రే, టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో కార్య‌క్ర‌మానికి హాజ‌రైతే.. ఇక్క‌డి క్రౌడ్ ని చూసి ఆశ్చ‌ర్య‌పోతారు. `ఇంతమంది జ‌నాల్ని ఒకే చోట ఇది వ‌ర‌కెప్పుడూ చూడ‌లేదు` అని షాకైపోతారు. అది నిజ‌మే. ఎందుకంటే బాలీవుడ్ లోనూ సినిమా ఈవెంట్లు జ‌రుగుతాయి. కానీ అక్క‌డి జ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకోరు. సినీ స్టార్లు కూడా ఫ్యాన్స్ లేకుండానే ఈవెంట్లు చేస్తుంటారు. కాబ‌ట్టే…ఇంత క్రౌడ్ ని వాళ్లెప్పుడూ చూసి ఉండ‌రు. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో సీన్ రివ‌ర్స్ అయ్యింది. బాలీవుడ్ జ‌నాలు కూడా ఓ హీరోని చూడ్డానికి ఎగ‌బ‌డ‌తార‌ని.. రౌడీ నిరూపించేశాడు. అది కూడా.. ముంబైలో!

లైగ‌ర్ ప్ర‌మోష‌న్లు ముంబైలో గ‌ట్టిగా జ‌రుగుతున్నాయి. ముంబైలోని ఓ షాపింగ్ మాల్ లో లైగ‌ర్ ప్ర‌మోష‌న్ ఈవెంట్ నిర్వ‌హిస్తే – అక్క‌డ ఇస‌కేస్తే రాల‌నంత జ‌నం పోగైపోయారు. దాంతో ఈవెంట్ జ‌రుగుతోంది ముంబైలోనా, హైద‌రాబాద్‌లోనా? అనే డౌట్ వ‌చ్చింది. ఈ క్రౌడ్ చూసి… బాలీవుడ్ వ‌ర్గాలే ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. `మేం ఈవెంట్ చేసినా ఈ స్థాయిలో జనాలు రారు.. అదే ఓ సౌతిండియా హీరో వ‌స్తే.. ఇంత మంది వ‌స్తారా` అంటూ ముక్కున వేలేసుకుంటున్నాయి. ప్ర‌భాస్‌, బ‌న్నీల‌కు ఈ స్థాయిలో ఫ్యాన్స్ వ‌స్తే.. అర్థం చేసుకోవొచ్చు. వాళ్ల సినిమాలు బాలీవుడ్ లోనూ విడుద‌లై సూప‌ర్ హిట్ట‌య్యాయి. విజ‌య్ న‌టించిన ఒక్క సినిమా కూడా బాలీవుడ్ కి వెళ్ల‌లేదు. `లైగ‌ర్‌`తో తొలిసారి అడుగుపెడుతున్నాడు. ఇంకా త‌న స్టామినా ఏమిటో బాలీవుడ్ లో తెలీదు. ఈలోగానే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొన్నాడంటే మామూలు విష‌యం కాదు. లైగ‌ర్ ట్రైల‌ర్ హిందీలో ఇటీవ‌లే విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. దాని ఎఫెక్టే ఇది. ట్రైల‌ర్ కే ఇలా ఉందంటే, సినిమా రిలీజ్ అయి, హిట్ట‌తే, రౌడీ రేంజ్ ఎలా ఉంటుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత...

పేరు సీమగర్జన – వినిపించింది చంద్రబాబుపై తిట్ల దండకం !

సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు...

బాల‌య్య హీరోయిన్ దొరికేసిన‌ట్టేనా..?

బాల‌కృష్ణ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. ఎందుకంటే..ఆయ‌న డైరెక్ట‌ర్ల హీరో. సెట్లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేస్తారాయ‌న‌. అందుకే ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తుంటారు. కాక‌పోతే... బాల‌య్య సినిమా...

సాయిధ‌రమ్ టైటిల్‌… ‘విరూపాక్ష‌’?

రిప‌బ్లిక్ త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా.. సాయి కొన్నాళ్లు సినిమాల‌కు, షూటింగుల‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని.. మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్నాడు. వ‌రుస‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close