విశాఖకు వచ్చింది ఆ “బోస్టన్” కాదు… అలాంటిది..!

విశాఖకు బోస్టన్ అంటూ.. రెండు రోజుల నుంచి వైసీపీ మీడియా.. సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. ప్రభుత్వం ఎంవోయూ కూడా చేసుకుంది. అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న రత్నాకర్ పండుగాయల .. తన పదవి న్యాయం చేసేలా.. ఓ ఎమ్మెన్సీని ఏపీకి ఫలంగా అందిస్తున్నట్లుగా ఫోటో కూడా విడుదల చేశారు. కానీ ఇప్పుడు విశాఖకు వచ్చిన బోస్టన్ కంపెనీ అమెరికా నుంచి కాకుండా.. కూకట్‌పల్లి నుంచి వచ్చిందనే విషయం బయటపడింది.

అది ” బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( బి.సి.జి)  ” కాదు.. ” ది బోస్టన్ గ్రూప్ ” ..!

పధ్నాలుగు నెలల పాలనలో జగన్ ఏ కంపెనీని తీసుకురాలేదని అంటున్నారని.. అన్న ” బోస్టన్ ” ను తీసుకొచ్చేశారని చెబుతున్నారు. నిజమే కాబోలని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ మామూలుది కాదు. మల్టినేషనల్ కంపెనీనే. ఏపీ సర్కార్‌కు రూ. ఏడున్నర కోట్లు తీసుకుని మూడు రాజధానులపై కాపీ పేస్ట్ నివేదిక ఇచ్చిన అనుబంధంతోనో.. కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనలోనూ సేవలు అందించిన అనుభవంతోనే.. విశాఖలోనే క్యాంపస్ పెట్టాలనుకుందేమోనని అందరూ అనుకున్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ను వెళ్లగొట్టినా… బోస్టన్‌ను తీసుకొస్తున్నారులే అని కొంత మంది సర్ది చెప్పుకున్నారు. కానీ.. అది బోస్టన్ కాదని.. బోస్టన్ లాంటిదని తెలియడానికి ఎన్నో గంటలు పట్టలేదు. ఎందుకంటే దాని పేరు ” ది బోస్టన్ గ్రూప్ “.

ఈ బోస్టన్ గ్రూప్ అడ్డా.. కూకట్‌పల్లిలో ఓ ఫ్లాట్..!

కూకట్ పల్లి ఫిఫ్త్ ఫేజ్‌లో కనకదుర్గ మ్యాన్షన్ అనే భవనం దగ్గరకు వెళ్తే.. “ది బోస్టన్ గ్రూప్” అనే బోర్డు కనబడుతుంది. అది దాదాపుగా నిర్మానుష్యంగా ఉంటుంది. మల్టీ నేషనల్ కంపెనీ లుక్ కాదు కదా… సాధారణ రియల్ ఎస్టేట్ కంపెనీ లుక్ కూడా ఉందు. ఎవరైనా వస్తే కూర్చోవడానికి చిన్న చిన్న ప్లాస్టిక్ టేబుల్ ఉంటాయి. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్, ఇ-లెర్నింగ్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స రీసెర్చ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, కార్పొరేట్ ఆఫైర్స్, ఎగ్జామ్ స్పెక్టమ్ ఇలా.. ఓ ఇరవై వరకూ.. స్పెషాలిటీస్ చెప్పారు. ఏంటీ అన్ని చేస్తారా… అని ఆశ్చర్యపోనవసరం లేదు. చేస్తారని చెబుతున్నారు కానీ చేశామని చెప్పడం లేదు. వాళ్ల క్లయింట్లెవరో ఎవరికీ తెలియదు. ఫార్ట్యూన్ 500 కంపెనీల దగ్గర్నుంచి మిడ్ మార్కెట్ కంపెనీల వరకూ సేవలు అందిస్తామని చెబుతూంటారు. పోనీ ఈ మల్టినేషనల్ కంపెనీకి వేల మంది ఉద్యోగులు… వందల కోట్ల ఆదాయం ఉందా అంటే అదీ లేదు. ఉన్నదల్లా 36 అంటే 36 మంది ఉద్యోగులు. ఆదాయం.. ఏడాదికి ఆరు మిలియన్ డాలర్లు. అంటే.. ఏటా ఐదారు కోట్ల ఆదాయం కూడా లేని కంపెనీ ఇది.

“బోస్టన్” సుబ్బు మామూలోడు కాదు… రహస్యలు అమ్మేసే కేసులోనే ఉన్నాడు..!

ది బోస్టన్ గ్రూప్ అంటూ…ఏపీ సర్కార్ ఎంవోయూ చేసుకున్న కంపెనీ చైర్మన్ సుబ్బు కోట. తన కెరీర్‌లో యాభై కంపెనీలు పెట్టారని.. ఎన్నెన్నో అంశాల్లో నిపుణులు అని చెబుతూంటారు కానీ.. ఆయనపై అమెరికాలో చాలా కేసులున్నాయి. అవి చిన్న చిన్న మోసాలవి కాదు. గూఢచర్యం చేస్తూ.. రహస్యాలు అమ్ముతున్న కేసులు. 1996లో రష్యా గూఢచారిగా కలరింగ్ ఇస్తూ.. అమెరికన్ గూఢచార సంస్థ ఎఫ్‌బీఐకి కొంత మెటీరియల్ అమ్మారు. దొరికిపోయి దోషిగా తేలాడు. ఈ కేసు విచారణలోనే 1985-90 మధ్య అమెరికా కు సంబంధించిన సమాచారాన్ని రష్యా గూఢచార సంస్థకు అమ్మినట్లుగా గుర్తించారు. అతనితో ఒప్పందాలు చేసుకున్న గూఢచారుల్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.

ఇలాంటి సంస్థలు విశాఖ మీద ఎన్ని వాలతాయో..?

విశాఖను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశారు. ఒకప్పుడు.. ఐటీ కంపెనీల రాకతో… అదానీ డేటా సెంటర్ ఏర్పాటుతో.. సాఫ్ట్ వేర్ హబ్ అయిపోతుందని..అంతా ఆశపడ్డారు. వర్జినల్ ఫార్ట్యూన్ 500 కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ … దశ మారుస్తుందని ఆశ పడ్డారు. కానీ.. వాటన్నింటినీ… వివాదాస్పదం చేసి.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న వాటిని కూడా బయటకు వెళ్లిపోయేలా చేశారు. ఇప్పుడు ” బోస్టన్ ” లాంటి కంపెనీలు వస్తున్నాయని ఉదరగొడుతున్నారు. ఇలాంటి కంపెనీలు విశాఖకు వెల్లువగా ఎన్ని వస్తాయో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close