రాజధాని మార్పు పై బొత్స వ్యాఖ్యల కలకలం, తుగ్లక్ నిర్ణయం అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని సురక్షితం కాదంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారుతున్నాయి. స్వయంగా మంత్రి గా ఉండి రాష్ట్ర రాజధాని సురక్షితం కాదని, దీన్ని మార్చడం పై తాము ఆలోచిస్తున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు:

ఆంధ్రప్రదేశ్ రాజధానికి వరద ముప్పు ఉందని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది చాలా స్పష్టంగా అర్థమవుతోందని, రాజధాని మార్చాలనే విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అసలు శివరామకృష్ణ కమిటీ అమరావతి రాజధాని కి సంబంధించి ఎటువంటి సూచనలు చేసిందో కూడా ఇప్పుడు తమ పరిశీలిస్తున్నామని, అమరావతిని రాజధానిగా చేస్తే దాన్ని సురక్షితంగా మార్చడం కోసం డ్యాములు నిర్మించాలని వస్తుందని, దాని అర్థం- రాజధాని కోసం మరింత వ్యయం పెట్టాల్సి ఉంటుందని, తద్వారా విలువైన ప్రజాధనం వృధా అవుతుందని, కాబట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వద్దా అనే అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందని బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పల్లపు ప్రాంతంలో , వరదలు వచ్చే ప్రాంతంలో రాజధానిని ఎందుకు ఎంపిక చేశారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలదీసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

దొనకొండ కోసమేనా?

అమరావతి రాజధాని నిర్మాణం నుండి ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలు వైదొలగినప్పుడే చాలామందికి అనుమానాలు వచ్చాయి – బహుశా, జగన్ ప్రభుత్వానికి అమరావతి రాజధానిగా కొనసాగించటం ఇష్టం లేదని. అయితే అప్పుడు వచ్చిన మరొక వాదన ఏంటంటే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాన్ని విభజించినప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలోని చాలా మందికి దొనకొండ ను కాంగ్రెస్ రాజధానిగా చేయనుంది అనే అంతర్గత సమాచారం అందింది అని. దీంతో అప్పటి కాంగ్రెస్ నేతలు చాలామంది దొనకొండ లో భూములు కొనుగోలు చేశారని వార్తలు కూడా వచ్చాయి. అప్పటి కాంగ్రెస్ నేతలందరూ చాలావరకు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపిలో లేదంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో ఉన్నారు. దీంతో తమ భూములకు విలువ పెంచుకోవడం కోసమే వీరు అమరావతిని అభివృద్ధి చేయకుండా, దొనకొండ మీద దృష్టి కేంద్రీకరించిిిి అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. నిజానికి అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ జరగడం మంచిదే కానీ, అధికార పార్టీ రాజకీయ నాయకులు తమ భూముుల విలువ పెంచుకోవడం కోసం , తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మాత్రం సమంజసం కాదు. పైగా ముంబై, చెన్నై వంటి దేశంలోని చాలా రాజధానులు వరద ముప్పు ఉన్న ప్రదేశంలోనే ఉంటూనే అభివృద్ధి చెందాయి.

ఇప్పుడు విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల తర్వాత ప్రధానంగా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది ఏమో, దొనకొండ ను, అమరావతి ని రెండింటిని రాజధానులుగా ప్రకటించి రెండు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం. రెండవది, అమరావతిలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని ఇంతటితో ఆపేసి, ఇకపై పూర్తిగా దొనకొండ మీద దృష్టి సారించి కాలక్రమంలో దొనకొండ ని పూర్తిస్థాయి రాజధానిగా మార్చడం. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల తర్వాత వినిపిస్తున్న ఈ రెండు వాదన లలో ఏది నిజమైనా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడే అవకాశం కనిపిస్తోంది.

ఇది తుగ్లక్ నిర్ణయం అవుతుందా?

మధ్యయుగం లో భారత దేశాన్ని పాలించిన తుగ్లక్ అనే రాజు గురించి చాలామందికి తెలిసిందే. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ఢిల్లీ నుండి రాజధానిని దౌలతాబాద్ కి మార్చి, ప్రజలను కూడా అక్కడికి తరలించే క్రమంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన తుగ్లక్ ని చరిత్ర పిచ్చి తుగ్లక్ గా గుర్తు పెట్టుకుంది. ఇదే తుగ్లక్ ఆ తర్వాత కాలంలో మళ్ళీ దౌలతాబాద్ నుండి రాజధానిని ఢిల్లీకి మార్చే ప్రయత్నం కూడా చేసి ప్రజలు ఇచ్చిన పిచ్చి తుగ్లక్ బిరుదు కి తాను అర్హుడనే అని నిరూపించుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఉన్న అమరావతి రాజధానిని దొనకొండ కి మార్చే ప్రయత్నం చేసినా, ఒకవేళ ఆ తర్వాత మళ్లీ అమరావతే మేలు అంటూ తిరిగి నిర్ణయాన్ని మార్చుకున్నా, ప్రస్తుత ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అప్పటి తుగ్లక్ నిర్ణయంతో ప్రజలు పోల్చి చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి.‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close