వైసీపీ నేత బొత్స ఏడ్చారు. ఎందుకంటే వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ ఉన్నాడని గతంలో ఆయన చేసిన ఆరోపణల్ని ఇవాళ అచ్చెన్నాయుడు మరోసారి గుర్తు చేశారు. జగన్ రెడ్డి పదవీ కాంక్ష చూస్తూంటే.. అది నిజమేనని అనిపిస్తోందని..బొత్స చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. దీంతో హడావుడిగా విశాఖలో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన వెంటనే ఏడుపందుకున్నారు. ఆయన ఎందుకు ఏడ్చారో మీడియా సమావేశంలో ఉన్న వారికి అర్థం కాలేదు. ఆయన ఏడ్చారో లేదో తెలియదు కానీ.. ఏడ్చినట్లుగా ఫేస్ పెట్టి..కర్చీఫ్‌తో ముఖం తుడుచుకున్నారు.
అచ్చెన్న అన్న మాటలకు ఆయన సమాధానం చెప్పలేదు. వైఎస్ మరణం వెనుక జగన్ ఉన్నారని గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తాను చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించలేదు. కానీ ఆయన చనిపోయిన విషయాన్ని చెప్పుకుని భావోద్వేగానికి గురైనట్లుగా కలరింగ్ ఇచ్చారు. వైఎస్ పై అమితమైన అభిమానం ఉన్నట్లుగా బొత్స నటిస్తున్నారు కానీ ఆయన ఆయన చనిపోయిన తర్వాత సీఎం సీటు కోసం గట్టిగా ప్రయత్నించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ప్రయత్నించారు. కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆ సమయంలో జగన్ పై.. షర్మిలపై.. విజయమ్మపై బొత్స ఎన్నో తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో విజయమ్మను తీవ్రంగా దూషించారు కూడా.
అయితే ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే జగన్ రెడ్డి ఎక్కడ దూరం పెడతారని అనుకుంటున్నారో లేకపోతే ఏడ్చి సెంటిమెంట్ పండిస్తే బాగుండని అనుకుంటున్నారో కానీ. ఏడ్చేశారు. అచ్చెన్నాయుడు ఆయన అనని మాటల్ని అన్నట్లయితే ఆ విషయం చెప్పుకోవాలి కానీ.. ఇలా చెప్పిన మాటల్నే చెబితే.. ఏడవడం ఏందో.. వైసీపీ నేతలకే తెలియాలి. మొత్తంగా.. బొత్స ఏడ్చి సానుభూతి పొందాలని గట్టి ప్రయత్నమే చేశారు. కానీ అది కామెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
