బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో ఆస్పత్రి పాలై.. చివరి రోజు మండలికి వచ్చారు. ఆయన మండలికి ఎందుకు వచ్చారో కానీ ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అయింది. ఓ వైపు అనారోగ్యం తిరగబెట్టింది..మరో వైపు సాక్షి మీడియా ఇచ్చిన ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదివేసి.. పయ్యావుల కేశవ్ మాటల దాడికి బీపీ తెచ్చుకోవాల్సి వచ్చింది.
జగన్ రెడ్డి ప్రతి నెల ఫేక్ నేరెటివ్ తో ఆర్థిక అంశాలపై ఓ ట్వీట్ చేస్తూంటారు. ఆయన కాగ్ రిపోర్టులు అంటూ ఉదహరిస్తారు కానీ కాగ్ రిపోర్టుల్ని అక్కడ పోస్టు చేయరు. సొంతంగా తమ టీమ్ తయారు చేసిన గ్రాఫిక్స్ నుపోస్టు చేస్తారు. వాటినే కాగ్, ఆర్బీఐ రిలీజ్ చేసిన గణాంకాలు అన్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. అదే రిపోర్టుల్ని బొత్సకు ఇచ్చారు. బొత్స చదివేశారు. పయ్యావుల ప్రతీ విషయాన్ని ఖండించి..నిజాలు చెప్పి.. కాగ్ రిపోర్టుల్ని ఇవ్వాలని బొత్సను సవాల్ చేశారు.
దాంతో బొత్సకు పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లయింది. చైర్మన్ కు పంపిస్తామని చెప్పి తప్పించుకున్నారు. కానీ అక్కడిక్కడ పయ్యావుల మొత్తం నిజాలను వెల్లడించారు. దీంతో బొత్సకు మైండ్ బ్లాంక్ అయింది. తనతో ఫేక్ రిపోర్టులు చెప్పించి రాజకీయం చేద్దామనుకుని..తనను బలి పశువును చేశారని ఆయన ఫీలవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పయ్యావుల దెబ్బకు ఆయన బీపీ తెచ్చుకుని తూలిపడబోయిన దృశ్యాలే వైరల్ అవుతున్నాయి.


