వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి మనోభావాలను పదే పదే కించ పరుస్తున్నారు. ఆయన బాధపడతారని కూడా అనుకోవడం లేదు. తనకు శత్రువులు అనుకున్న వారిని బొత్స శత్రువులుగా చూడటం లేదు. పైగా స్నేహితులుగా చూస్తున్నారు. వాటిని వీడియోలు, ఫోటోలుగా వైరల్ అయ్యేలా చేసుకుంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కమ్యూనిస్టులు ఓ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. దానికి బొత్స వెళ్లారు. ఆ సమావేశానికి షర్మిల కూడా వచ్చారు. అప్పుడు జగన్ విధానం ప్రకారం బొత్స..చూసిచూడనట్లుగా ఉండాలి లేదా కోపంతో అక్కడ్నుంచి వెళ్లిపోవాలి. కానీ…బొత్స షర్మిలను ఆప్యాయంగా పిలిచి తన పక్కన సీటిచ్చారు. మంచిచెడ్డలు మాట్లాడారు.
నిజానికి రాజకీయంగా షర్మిలపై బొత్స కూడా చాలా విమర్శలు చేశారు. బొత్సపై కూడా షర్మిల విమర్శలు చేశారు. కానీ ఇక్కడ వ్యక్తిగత మంచి, మర్యాదను మాత్రం కాపాడుకున్నారు. జగన్ కు ఇలాంటివి నచ్చవు. తనపై పోరాడుతున్న చెల్లితో అంతబాగా మాట్లాడారు అంటే.. ఆయనకు పిచ్చకోపం వస్తుంది. ఈ విషయం బొత్సకు తెలుసు. అయినా ఆయన తన విధానాలను మార్చుకోలేదు.
షర్మిల ఇష్యూలోనే కాదు.. ఇటీవల హైదరాబాద్ లో అల్లు అరవింద్ తల్లి దశదిన కర్మలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు కూడా .. రఘురామ, గంటా వంటి వాళ్లతో బొత్స మరీ అడ్వాన్స్ అయిపోయారు. ఇవన్నీ జగన్ మనోభావాలను దెబ్బతీసేవే. అయినా బొత్స పట్టించుకోవడం లేదు.