బొత్సా.. ఆ శ్మశానం నుంచే కదా రోజూ పరిపాలిస్తోంది..!

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ… అమరావతిని శ్మశానంతో పోల్చారు.  ” చంద్రబాబు ఈ శ్మశానాన్నా… నువ్వు చూడడానికి వచ్చేది..” అని.. తనకు మాత్రమే సాధ్యమైన… వ్యంగ్య ముఖకవళికలతో ప్రశ్నించారు. “చూశావా.. నువ్వు.. ప్రపంచ స్థాయి రాజధానిని కడతానని విర్రవీగావ్.. మేము..దాన్ని శ్మశానం చేశాం .. నీ మీద మాదే విజయం ..” అన్నట్లుగా.. బొత్స ప్రకటన ఉంది. రాజధాని అమరావతిపై.. బొత్స ఇప్పటికే.. అనేక రకాల నిందలు వేశారు. మొదట ముంపునకు గురవుతుందన్నారు. కృష్ణాకు పది లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా రాజధాని గ్రామాల్లోకి చుక్క నీరు రాలేదు. అయినా మునిగిపోయిందని ప్రచారం చేశారు. ఆతర్వాత అక్కడ.. రాజధాని నిర్మాణాల ఖర్చు చాలా ఎక్కువన్నారు. అంత ఖర్చు పెట్టడం దండగన్నారు.

ఆ తర్వాత స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తామన్న.. సింగపూర్ కంపెనీని పంపేశారు. అప్పుడు కూడా.. రూ. లక్షల కోట్లు పెట్టి.. ఆ కంపెనీ ఏం చేస్తుందో చెప్పలేదని.. అందుకే వెళ్లిపోయిందని.. వెటకారం ఆడారు. అంతకు మించి.. రాజధానిపై.. ఓ సామాజిక ముద్ర వేశారు. రాజధాని మొత్తం ఓ కులందేనని.. ఓ కులం కోసం.. మేము రాజధాని కట్టబోమంటూ.. ప్రకటనలు చేశారు. ఓ మంత్రిగా … ఉండి.. ఇలా సామాజికవర్గాల వారీగాప్రజలను విడదీసి రాజకీయం చేయడం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఏకంగా అమరావతిని శ్మశానంతోనే పోల్చారు.  

సొంత రాష్ట్ర అభివృద్ధికి పిల్లర్‌గా మారుతుందని … దేశవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు… అంచనా వేసిన నగరాన్ని చేజేతులా.. ఘోస్ట్ సిటీగా మార్చిన వైనం… ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏపీ సర్కార్ అమరావతిపై వ్యవహరిస్తున్న విధానంతో.. దేశానికే నష్టమని… విశ్లేషణలు, హెచ్చరికలు వచ్చాయి. కానీ.. ఏపీ సర్కార్ పెద్దలు మాత్రం.. తమ రాష్ట్రం గురించి కాకుండా.. కేవలం.. కులాలను రెచ్చగొట్టడంపై మాత్రమే.. దృష్టి పెట్టారు. రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు.. ప్రజల మనసుల్లో కులద్వేషాన్ని రాజధాని వేదికగా నింపి.. తమ రాజకీయ పబ్బం తాము గడుపుకోవాలనుకుంటున్నారు. దానికి బొత్స మాటలే సాక్ష్యం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close