సరైనోడు సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టాడు బోయపాటి శ్రీను. ఆ సినిమా వంద కోట్ల మైలు రాయి దాటింది. బోయపాటి ఓకే అంటే.. అతనితో పనిచేయడానికి స్టార్ హీరోలు సిద్దంగా ఉన్నారు. ఇలాంటి దశలో ఇచ్చిన మాట కోసం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు బోయపాటి. బెల్లంకొండ ఇది వరకటి సినిమా స్పీడున్నోడు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. శ్రీను మైనస్సులు క్లియర్‌గా అర్థమయ్యాయి. అందుకే బోయపాటి ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకొంటున్నాడు. బెల్లంకొండ లుక్‌ని పూర్తిగా మార్చేశాడు. సినిమాలో కూడా `ప్యాడింగ్`కి అనువైన మార్గాల్ని అన్వేషిస్తున్నాడు. విలన్ క్యారెక్టర్ కోసం బోయపాటి అన్వేషణ మొదలైంది. శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి సీనియర్ నటుల్ని విలన్ పాత్ర కోసం పరిశీలిస్తున్నాడు. విలన్ ఎవరైనా గానీ, మరో రెండు కీలకమైన క్యారెక్టర్లలో ఇద్దరు కథానాయకులు కనిపిస్తారని సమాచారం. ఆ ఇద్దరు కథానాయకుల దగ్గర బోయపాటి మాట తీసుకొన్నాడని, అతి త్వరలో ఆ ఇద్దరూ ఎవరన్నది తెలిసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. బోయపాటి – బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్‌ని ఎంచుకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం లొకేషన్ల వేటలో ఉంది.